Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తనదైన సెలెక్టివ్ సినిమాలు చేస్తూ యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు......

Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?

Ram Pothineni Clarifies About His Secret Love

Updated On : June 29, 2022 / 4:53 PM IST

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తనదైన సెలెక్టివ్ సినిమాలు చేస్తూ యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ హీరో సినిమా వస్తుందంటే, థియేటర్ల వద్ద యూత్ సందడి మామూలుగా ఉండదు. అయితే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. అయితే గతకొంత కాలంగా రామ్ పోతినేని ప్రేమవ్యవహారంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు గుప్పుమంటున్నాయి.

Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!

రామ్ తన చిన్ననాటి స్నేహితురాలిని సీక్రెట్‌గా లవ్ చేస్తున్నాడని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలెక్కడం ఖాయమంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. అసలు తాను ఎలాంటి రిలేషన్‌లో లేనని చెబుతూనే, ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నవారికి దండం పెట్టాడు. ఇలాంటి వార్తల వల్ల తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు కూడా తాను ఎలాంటి అమ్మాయిని ప్రేమించడం లేదనే వివరణ ఇవ్వాల్సి వచ్చిందని రామ్ అన్నారు.

Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?

తాను స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల కారణంగా తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని రామ్ తెలిపారు. అంతేగాక, తాను స్కూల్ కు వెళ్లిందే తక్కువ అని.. అలాంటిది తనకు ఆ వయసులో సీక్రెట్ లవర్ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా ఇలాంటి పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని రామ్ కోరారు. ఏదేమైనా రామ్‌పై వస్తున్న పెళ్లి పుకార్లకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పాలి.