Virat Kohli : ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పశ్చాత్తాపం

కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన సంగారెడ్డి వాసి రాంనగేశ్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈవిషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

Virat Kohli : ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పశ్చాత్తాపం

Kohli

indecent comments on Kohli’s daughter : కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన సంగారెడ్డి వాసి రాంనగేశ్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్‌ రీజియన్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నగేశ్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్‌లో వివిధ విధానాలను పరిశీలించాడు.

అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. నగేశ్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ నుంచి Un Follow అయ్యారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరించారు.

Cannabis Smuggling : అమెజాన్‌ ద్వారా కోటీ 10లక్షల విలువైన గంజాయి రవాణా

సంగారెడ్డి జిల్లాకు చెందిన రాంనగేశ్‌ హైదరాబాద్‌ ఐఐటీ నుంచి సాఫ్ట్‌వేర్‌ విద్యనభ్యసించాడు. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేశ్.. ఎంఎస్‌ కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు గత మంగళవారం రాత్రి సంగారెడ్డికి వచ్చి నగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేశ్ తండ్రి అతడి బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.