Cannabis Smuggling : అమెజాన్‌ ద్వారా కోటీ 10లక్షల విలువైన గంజాయి రవాణా

గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను వినియోగించుకుంటున్నారు. టన్ను గంజాయిని ఈవిధంగా తరలించినట్లు తేలింది. విశాఖ నుంచి 4నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది.

Cannabis Smuggling : అమెజాన్‌ ద్వారా కోటీ 10లక్షల విలువైన గంజాయి రవాణా

Cannabis (1)

cannabis smuggling through Amazon : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణాపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను వినియోగించుకుంటున్నారు. టన్ను గంజాయిని ఈ విధంగా తరలించినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లో గంజాయితో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని విశాఖ నుంచి నాలుగు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు చెప్పారు.

సూరజ్‌ అలియాస్‌ కల్లూ పావవియా, పింటూ అలియాస్‌ బిజేంద్ర సింగ్‌ తోమర్‌ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. నాలుగు నెలలుగా అమెజాన్‌ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇప్పటి వరకు కోటీ 10లక్షల విలువైన గంజాయిని తరలించినట్లు పేర్కొన్నారు.
PM Modi నేడు పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నిందితుల్లో ఒకరైన సూరజ్‌.. హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకుని గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఇలా తరలించిన గంజాయిని మధ్యప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై అమెజాన్‌కు మధ్యప్రదేశ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. పోలీసుల దర్యాప్తుకు కంపెనీ సహకరిస్తుందని అమెజాన్‌ తెలిపింది.