Bigg Boss Tamil 5 : కమల్ ప్లేస్‌లో రమ్యకృష్ణ

కమల్ హాసన్ స్థానంలో స్మాల్ స్క్రీన్‌పై సందడి చెయ్యబోతున్న శివగామి..

Bigg Boss Tamil 5 : కమల్ ప్లేస్‌లో రమ్యకృష్ణ

Ramya Krishnan

Bigg Boss Tamil 5: ఇటీవల అమెరికా వెళ్లిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చెన్నై తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సలహాలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

శంకర్‘ఇండియన్ 2’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ‘విక్రమ్’ మూవీ షెడ్యూల్ వాయిదా వేశారు. కట్ చేస్తే కమల్ హోస్ట్ చేస్తున్న తమిళ్ ‘బిగ్ బాస్’ సీజన్ 5 పరిస్థితి ఏంటి అనే సందేహం తలెత్తింది. కమల్ స్థానంలో ఆయన కూతురు శృతి హాసన్ హోస్ట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు హోస్ట్ ఎవరనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Shruti Haasan : శృతి, కాజల్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా!

ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ‘బాహుబలి’ తో మరోసారి ఆమెకు ఆమే సాటి అనిపించుకున్న ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ హోస్ట్‌గా రాబోతున్నారు. కమల్‌తో ఆమె ‘పంచతంత్రం’ సినిమా చేశారు. ఇప్పుడు కమల్‌కి బదులు ‘బిగ్ బాస్’ సీజన్ 5 కి హోస్టింగ్ చెయ్యబోతున్నారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు రమ్యకృష్ణ ఈ షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం