Alia Ranbir: అలియా లెహంగా రణబీర్ కాలితో.. వీడియో వైరల్!

బాలీవుడ్ ప్రేమ జంటలు ఒక్కొకటి పెళ్లి పీటలెక్కుతున్నట్లుగా నేషనల్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ఊదరగొట్టేస్తున్నాయి. ఒకపక్క విక్కీ-కత్రినా పెళ్లి రేపో మాపో అని కథనాలు చక్కర్లు..

Alia Ranbir: అలియా లెహంగా రణబీర్ కాలితో.. వీడియో వైరల్!

Alia Ranbir

Updated On : November 30, 2021 / 10:10 AM IST

Alia Ranbir: బాలీవుడ్ ప్రేమ జంటలు ఒక్కొకటి పెళ్లి పీటలెక్కుతున్నట్లుగా నేషనల్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ఊదరగొట్టేస్తున్నాయి. ఒకపక్క విక్కీ-కత్రినా పెళ్లి రేపో మాపో అని కథనాలు చక్కర్లు కొడుతుండగా.. అలియా భట్, రణబీర్ కపూర్ జంట పెళ్లి అంటే ఇప్పట్లో లేదంటూనే కలిసి మెలిసి చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం కెరీర్ లో ఎదిగే పనిలో ఉన్న అలియా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేస్తూనే ఛాన్స్ దొరికితే రణబీర్ ఇంట వాలిపోతోంది.

Bimbisara: కళ్యాణ్ రామ్ ఊహించని ట్రాన్స్‌ఫర్మేషన్.. కలిసొచ్చేనా?

ఈ మధ్యే దీపావళి వేడుకను ముంబై సినీ కుటుంబాలన్నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాయి. అలియా-రణబీర్ జంట కూడా ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. రణ్‌బీర్‌-ఆలియాలు ఇద్దరు బ్లూ కలర్‌ మ్యాచింగ్‌ కాస్ట్యూమ్స్‌ వేసుకుని సరదాగా ఫోటో సెషన్ కూడా ఇచ్చారు. అలియా బ్లూ కలర్ లెహంగాలో మెరిసిపోతూ చూడముచ్చటగా కనిపిస్తే.. లెహంగా నేలని ఊడ్చేస్తూ క్యారీ చేయడం ఆమెకు కష్టంగా మారింది. ఇక్కడే రణబీర్ కాస్త అసహనానికి గురయ్యాడు.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

అలియా మెట్లుదిగి కిందకు వెళ్తుండగా నేలపైన ఆకర్షణీయంగా పరిచిన బంతి పూలను అలియా లెహంగా టచ్ చేస్తూ వెళ్ళింది. దీంతో రణ్‌బీర్‌ తన కాలితో ఆలియా లెహంగాను కాలితో జరిపి బంతి పూలను తప్పించాడు. అంతేకాదు.. రణ్‌బీర్‌ కాస్త చిరాకుగా ఉండటంతో ఆలియావైపు ఆప్యాయంగా చూడలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. రణ్‌బీర్‌ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.