Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..

షంషేరా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్. తనకి ఆలియా రెండో భార్య అని షాకింగ్ న్యూస్ చెప్పాడు. రణబీర్ మాట్లాడుతూ..................

Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..

Alia Bhatt

Updated On : June 26, 2022 / 7:23 AM IST

Ranbir Kapoor :  బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే తన ప్రియురాలు ఆలియా భట్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ మరింత బిజీ అయ్యారు. ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉన్నారు. రణబీర్ వరుస సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం షంషేరా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

Prithviraj Sukumaran : భవిష్యత్తులో రీమేక్ సినిమాలు ఉండవు.. చిరంజీవి గారు నన్నే చేయమన్నారు కానీ..

షంషేరా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్. తనకి ఆలియా రెండో భార్య అని షాకింగ్ న్యూస్ చెప్పాడు. రణబీర్ మాట్లాడుతూ.. ”ఆలియా నాకు రెండో భార్య. అది ఎలాగంటే గతంలో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన నాకు చాలా క్రేజీగా అనిపించింది. నేను హీరోగా కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఓ లేడీ ఫ్యాన్ మా ఇంటికి వచ్చి మా ఇంటి గేట్‌ను పెళ్లాడింది. నేను ఇంటికి రాగానే మా వాచ్‌మెన్‌ ఆ విషయం చెప్పాడు. మా గేటుని రణబీర్ అనుకోని పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు చల్లి, నాకూ తనకు పెళ్లయిపోయినట్లేనని సంతోషించి అక్కడినుంచి వెళ్లిపోయిందట. దీంతో ఆమె నా మొదటి భార్య అవుతుందేమో. కానీ నా మొదటి భార్యను నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇలాంటి క్రేజీ పని చేసిన అమ్మాయిని చూడాలి” అని నవ్వుతూ తెలిపాడు. అయితే దీనిపై ఆలియా ఏమంటుందో చూడాలి మరి.