Pakka Commercial: ఏంజెల్ రాశిఖన్నా.. మేకర్స్ స్పెషల్ విషెష్!

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకున్న గోపి జిల్ సినిమాతో..

Pakka Commercial: ఏంజెల్ రాశిఖన్నా.. మేకర్స్ స్పెషల్ విషెష్!

Pakka Commercial

Updated On : November 30, 2021 / 1:18 PM IST

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకున్న గోపి జిల్ సినిమాతో యాక్షన్ తో స్టైలిష్ ను కలిపి మోడ్రన్ లుక్ లో అదరగొడుతున్నారు. జిల్ సినిమాను తెరకెక్కించిన మూవీనే ఇప్పుడు పక్క కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తుండడం.. గీత ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం కావడం, మారుతి టైమింగ్ పై నమ్మకంతో ఇప్పుడు ఈ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.

Telugu Film Releases: టార్గెట్ డిసెంబర్.. ఈ వారం సినిమాలివే!

ఇదిలా ఉండగా ఈరోజు (నవంబర్ 30) రాశీ ఖన్నా బర్త్ డే కావడంతో పక్క కమర్షియల్ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మారుతీ తన లాస్ట్ సినిమా ‘ప్రతి రోజు పండగ’లో రాశిని ఏంజెల్ ఆర్ణా అంటూ చిన్న కామికల్ గా చూపించగా.. ఈసారి నిజమైన ఏంజెల్ లా చూపించారు. తన బర్త్ డే స్పెషల్ గా రివీల్ చేసిన ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉంది. అలాగే ఇందులో టోటల్ సెటప్ లో మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి.

Divi Vadthya: దివి వాధ్యా.. అందం అదరహో!

ఇక ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా ముమ్మర షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ ఫస్ట్ లుక్ మాదిరే ఈ సినిమాలో గోపీచంద్ కూడా స్టైలిష్ యాక్షన్ హీరోగా అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి మారుతి ఆ ఆశలు ఎంతవరకు నిజం చేస్తాడో చూడాలి.