Telugu Film Releases: టార్గెట్ డిసెంబర్.. ఈ వారం సినిమాలివే!

గత వారం రిలీజైన సినిమాలేవీ బాక్సాఫీస్ కి బూస్టప్ తీసుకురాలేదు. ఈ వీక్ మాత్రం బాలయ్య బరిలోకి దిగుతున్నాడు. కొవిడ్ తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్ సినిమా థియేటర్స్ లోకి రావడం అఖండతో..

Telugu Film Releases: టార్గెట్ డిసెంబర్.. ఈ వారం సినిమాలివే!

Telugu Film Releases (1)

Telugu Film Releases: గత వారం రిలీజైన సినిమాలేవీ బాక్సాఫీస్ కి బూస్టప్ తీసుకురాలేదు. ఈ వీక్ మాత్రం బాలయ్య బరిలోకి దిగుతున్నాడు. కొవిడ్ తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్ సినిమా థియేటర్స్ లోకి రావడం అఖండతోనే స్టార్ట్ కాబోతుంది. అఖండతో పాటూ ఈ వారం సినిమా హాళ్లకొచ్చేస్తున్న టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

Divi Vadthya: దివి వాధ్యా.. అందం అదరహో!

బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండ. సూపర్ హిట్స్ సింహా, లెజెండ్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో మూవీ కావడంతో ఫ్యాన్స్ లో భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమా అదీ బాలయ్య సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల అంచనాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ 2 గురువారం ముహూర్తం పెట్టుకొని… వరల్డ్ వైడ్ గర్జించడం ఖాయమని ఖరాఖండిగా చెప్తున్నాడు అఖండ. ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు.. ఇలా క్యాస్ట్ గా కూడా బాగానే ఉంది. బాలయ్య అభిమానులు ఆల్రెడీ పండుగ చేసుకుంటున్న అఖండ ఏ మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

Pushpa: పుష్పరాజ్ కోసం చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్..?

బాలయ్యబాబుకు పోటీ కాదు కానీ అదే రోజు ఏ సెంటర్స్ ను ఎయిమ్ చేసిన మలయాళ మూవీ మరక్కార్. మలయాళీ స్టార్ మోహన్ లాల్ తో పాటూ కీర్తి సురేశ్, అర్జున్, సునీల్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు ఈ సినిమాని. అరేబియా సముద్ర సింహం అన్న సబ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. డిసెంబర్ 2న నేషనల్ వైడ్ రిలీజ్ కాబోతుంది మరక్కార్.

Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

నిత్యామీనన్, సత్యదేవ్ లీడ్ రోల్స్ లో ఫుల్ ఫన్ మూవీ ‘స్కైలాబ్’ సినిమా రాబోతుంది. నిత్యామీనన్ నిర్మించిన ఈ సినిమాను విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేసాడు. డిసెంబర్ 4న డేట్ ఫిక్స్ చేసుకొని ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు స్కైలాబ్ టీమ్. 1973 స్కైలాబ్ ఉదాంతాన్ని బేస్ చేసుకొని కామెడీగా ఈ సినిమాను మేకొవర్ చేసారు. ఇందులో జర్నలిస్ట్ గా కనిపించే నిత్యామీనన్ పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడారు. సత్యదేవ్ తో పాటూ రాహుల్ రామకృష్ణ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన స్కైలాబ్ కూడా ఖచ్చితంగా ఆడియెన్స్ అలరిస్తుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్.

Acharya: ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!

బాలీవుడ్ థియేటర్స్ లో ఈ వారం.. మన ఆర్ ఎక్స్ 100 రీమేక్ తడప్ రిలీజ్ కాబోతుంది. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా తారా సుతారియా హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ కి తగ్గట్టు ఫుల్ గా మేకొవర్ చేసి రెడీ చేసిన తడప్ ఇప్పటికే ఫుల్ గా బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇక సాంగ్స్ కూడా వరుసగా రిలీజై హిటెక్కించాయి. సో డిసెంబర్ 3న రిలీజయ్యే తడప్.. అహాన్, తారా జంట కెరీర్ గ్రాఫ్ ను పరుగెతిస్తుందో లేదో చూడాలి.