Acharya: ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!

అన్న ఎంట్రీతో ఆచార్య సినిమా వేరే లెవల్ అని ఫ్యాన్స్ అనుకోవడంలో ఏమాత్రం డౌట్ లేదు. మరి ఆ ఎంట్రీ అలాంటిది. బ్యాక్ టూ బ్యాక్ పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కి తనలోని కొత్త..

Acharya: ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!

Acharya

Acharya: అన్న ఎంట్రీతో ఆచార్య సినిమా వేరే లెవల్ అని ఫ్యాన్స్ అనుకోవడంలో ఏమాత్రం డౌట్ లేదు. మరి ఆ ఎంట్రీ అలాంటిది. బ్యాక్ టూ బ్యాక్ పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కి తనలోని కొత్త యాంగిల్ చూపిస్తున్న రామ్ చరణ్.. లేటెస్ట్ గా ఆచార్య సినిమా మీద మరింత హైప్ తెచ్చేశారు. సిద్దగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నానంటూ ఓ చిన్న శాంపిల్ చూపించారు చరణ్.

Radhe Shyam: కంప్లీట్ రొమాంటిక్‌గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!

చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ ఇంట్రస్టింగ్ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన చిరంజీవి టీజర్.. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తే.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ టీజర్.. అసలు సినిమా రేంజ్ నే పెంచేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆచార్యలో సిద్దగా కనిపిస్తున్న రామ్ చరణ్ పవర్ పుల్ రోల్.. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ని విపరీతంగా పెంచేసింది.

Alia Ranbir: అలియా లెహంగా రణబీర్ కాలితో.. వీడియో వైరల్!

ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతున్న ఆచార్య కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కెరీర్ లో బ్యాక్ టూ బ్యాక్ పవర్ ఫుల్ సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. ఆచార్యలో స్పిరిచ్యువాలిటీ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. తన లుక్స్ తోనే ఇంటెన్స్ ఎమోషన్స్ ని చూపిస్తున్న రామ్ చరణ్.. యాక్టింగ్ విషయంలో చిరంజీవితో పోటీపడుతున్నారు. అగ్రెసివ్ లుక్స్ ఇస్తూనే అంతకుమించి రొమాన్స్ ని కూడా చూపిస్తున్నారు చరణ్.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

ఈ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన చరణ్ టీజర్ తో సినిమా హిట్ గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. ఆ రేంజ్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు తండ్రీ కొడుకులు. ఒక వైపు తన పెద్దరికంతో ఆచార్యుడిగా కనిపిస్తున్న చిరంజీవి, మరో వైపు సిద్ధగా దూకుడుగా కనిపిస్తున్న రామ్ చరణ్ ఇద్దరి మద్య పర్సనల్, ప్రొఫెషనల్ క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తూ.. చిరుతపులుల్ని చూపించి యాప్ట్ సీన్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు కొరటాల.