Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

మాకొక్క హిట్టు కావాలి రా అని సాంగేసుకుంటున్నారు కొంతమంది స్టార్స్. కొవిడ్ ముందు.. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక డీలాపడ్డ ఈ హీరోలు.. ఇప్పుడు ఖచ్చితంగా బాక్సాఫీస్ షేక్ చేస్తామనే మాటలు..

Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

Telugu Star Hero's

Telugu Star Hero’s: మాకొక్క హిట్టు కావాలి రా అని సాంగేసుకుంటున్నారు కొంతమంది స్టార్స్. కొవిడ్ ముందు.. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక డీలాపడ్డ ఈ హీరోలు.. ఇప్పుడు ఖచ్చితంగా బాక్సాఫీస్ షేక్ చేస్తామనే మాటలు చెప్తున్నారు. ఇలాంటి ప్రమోషనల్ స్టంట్స్ కామనే.. కానీ నిజంగానే వాళ్లకి ఇప్పుడో సాలిడ్ హిట్ మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. యంగ్ హీరోలే కాదు హిట్టు పడాల్సిందే అంటున్న సీనియర్ స్టార్లూ టాలీవుడ్ లో ఉన్నారు. ఒక్కొక్కరుగా నెల నెల గ్యాప్ తో రంగంలోకి దిగుతున్నారు. వీళ్లకి థియేటర్స్ లో బంపర్ బ్లాక్ బస్టర్ పడి చాలా కాలమే అవుతోంది. అందుకే ఆకలి మీద కసిగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వీళ్లు.

Anchor Shyamala: కొత్త ఇల్లు చూపించిన యాంకర్.. బాబోయ్ ఇంద్రభవనమే!

డిసెంబర్ 24న థియేటర్స్ కి రాబోతున్న నానికి.. శ్యామ్ సింగ రాయ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొవిడ్ ముందు హాళ్లకొచ్చిన గ్యాంగ్ లీడర్.. పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ఆ తర్వాత వరుసగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వి, టక్ జగదీశ్ సినిమాలు ఎక్స్ పెక్ట్ చేసినంత మ్యాటర్ చూపించలేకపోయాయి. ఓటీటీ కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఓకే కానీ అవే థియేటర్స్ కి వచ్చుంటే అన్న క్వశ్చన్స్.. నాని ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడతాయి. టీజర్, లిరికల్ సాంగ్స్ తో ప్రామిసింగ్ మూవీగా కనిపిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ పైనే ఇప్పుడు ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు నాని. న్యాచురల్ స్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతిశెట్టి కూడా నటించడం కూడా కలిసొచ్చేదే. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది కానీ ఇప్పుడు కావాల్సింది ఓ బలమైన హిట్ అందుకే ఫుల్ స్వింగ్ లో డిఫరెంట్ మోడ్ లో ప్రమోషన్స్ షురూ చేసాడు.

Acharya: ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!

బింబిసారాపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కొన్నేళ్లుగా ఈ హీరోకి సరైన హిట్ లేదు. 118 యావరేజ్ అనిపించుకుంటే.. ఎంత మంచి వాడవురా డిజాస్టర్ గా నిలిచింది. సో స్టాండర్డ్ గా టాలీవుడ్ లో నిలబడాలంటే కల్యాణ్ రామ్ కి బింబిసారా పాజిటివ్ హోప్స్ తీసుకురావాలి. ఎందుకంటే హిస్టారికల్ ఫిల్మ్ గా హై క్లాస్ గా తెరకెక్కిన బింబిసారా తర్వాత డెవిల్ లాంటి పాన్ ఇండియా మూవీ లైన్ లో ఉంది. ఈ మూవీ హిట్టయితేనే డెవిల్ కి లైన్ ఫుల్ గా క్లియరవుతుంది.

Radhe Shyam: కంప్లీట్ రొమాంటిక్‌గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు నాగశౌర్య. అమ్మమ్మగారిల్లు నుంచి మొదలుపెడితే.. అశ్వత్థామ, వరుడు కావలెను వరకు బాక్సాఫీస్ పై పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ ఫిల్మ్ వరుడు కావలెను పర్వాలేదనిపించినా మాంచి కిక్కించే కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయింది. సో నాగశౌర్య ప్రస్తుత లక్ష్యం.. లక్ష మూవీపైనే. ఈ సినిమా కోసం బాడీని డైనమైట్ గా సిద్ధం చేసి ఆర్చరీ నేర్చుకుని బాగానే కష్టపడ్డాడు. ఈ కష్టానికి తగ్గట్టు ఎంతటి విజయాన్ని లక్ష్య ఇస్తుందో డిసెంబర్ 10న తెలుస్తుంది.

Alia Ranbir: అలియా లెహంగా రణబీర్ కాలితో.. వీడియో వైరల్!

శర్వానంద్ కు కూడా అస్సలు టైం బాలేదు. పడి పడి లేచే మనసు తర్వాత ఆడియెమ్స్ ముందుకొచ్చిన రణరంగం, జానూ ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. కొవిడ్ తర్వాత ఎంత ఎక్స్ పెక్టేషన్స్ తో శ్రీకారం, మహాసముద్రం రిలీజయ్యాయో.. అంతే రేంజ్ లో డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. సో ప్రస్తుతం రిలీజ్ కి రెడీఅయిన ఒకే ఒక జీవితం.. సెట్స్ పై ఉన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమానే మళ్లీ శర్వానంద్ కి బూస్టప్ నివ్వాలి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఒకే ఒక జీవితం ముస్తాబు కాగా ఇక నేషనల్ క్రష్ రష్మికతో చేస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీపైనే శర్వా హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నాడు.

Bigg Boss 5: ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. ఎలిమినేట్ అయ్యేది?

నితిన్ గ్రాఫ్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదు. లేటెస్ట్ రిలీజెస్ చెక్ డిజాస్టర్ గా నిలువగా.. రంగ్ దే పర్వాలేదనిపించింది. మ్యాస్ట్రో ఓటీటీ హిట్ గా సక్సెస్ సాధించింది. అయితే నితిన్ కెరీర్ కిప్పుడు థియేటర్స్ లో గట్టి హిట్ పడాలి. అందుకే ట్రాక్ మార్చి కొత్తగా మాచర్ల నియోజక వర్గం చేస్తున్నాడు. కృతిశెట్టి నితిన్ తో జోడికట్టింది. 2022 ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

గోపీచంద్ వరుసగా సినిమాలైతే ఇస్తున్నాడు కానీ సరైన సక్సెస్ సాధించలేకపోతున్నాడు. పంతం, చాణక్య, ఆరడుగుల బుల్లెట్టు వంటివి ఫ్లాప్ ముద్ర వేయించుకుంటే సీటీమార్ మాత్రం కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత రిలీజై యావరేజ్ గా నిలించింది. అందుకే తనకు ఫుల్ సక్సెస్ ఇచ్చే కమ్ బ్యాక్ మూవీ పక్కా కమర్షియల్ అని చెప్తున్నాడు గోపీచంద్. మారుతి డైరెక్షన్లో తెరకెక్కతోన్న ఈ మూవీలో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తానంటున్నాడు.

Padutha Theeyaga: బాలు మానస పుత్రిక.. వారసుడే నాయకుడై.. మళ్ళీ సరికొత్తగా!

సీనియర్ హీరో నాగార్జునకు హిట్ పడి చాలా ఏళ్లు గడుస్తున్నాయి. ఆఫీసర్, మన్మధుడు2, వైల్డ్ డాగ్ వంటి భారీ బంపర్ ఫ్లాప్స్ తర్వాత తనకిప్పుడో సాలిడ్ హిట్ ఖచ్చితంగా అవసరం. అందుకే బంగార్రాజుని గ్రాండ్ గా రెడీ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న బంగార్రాజు 2022 సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసింది. ఇది సూపర్ హిట్టయితే నాగ్ నెక్ట్స్ మూవీ ఘోస్ట్ పైనా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. కొడుకు నాగచైతన్య, కృతిశెట్టిని కూడా ఇందులో చూపించి బంగార్రాజు సక్సెస్ పైనే హోప్స్ పెట్టుకున్నారు నాగార్జున.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

ఖైదీ నంబర్ 150 తర్వాత వచ్చిన చిరూ సైరా నరసింహారెడ్డి సూపర్ హిట్ అనిపించుకుంది. కానీ కమర్షియల్ గా చూస్తే భారీ అంచనాలను మాత్రం అందుకోలేదు. చిరూ స్టామినాకు తగ్గ హిట్ మాత్రం ఆచార్యతో సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఆచార్య బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సృష్టిస్తే.. లైన్ లో ఉన్న చిరూ మిగిలన సినిమాలకు మరింత హైప్ క్రియేట్ కావడం ఖాయం. అందుకే చిరూ కూడా కొడుకు చరణ్ ను రంగంలోకి దింపి ఆచార్యతో థ్రిల్లింగ్ సక్సెస్ చూడాలనుకంటున్నారు.

Telugu Films: కొవిడ్‌తో పోయింది పిండుకొనే పనిలో స్టార్స్!

బాలకృష్ణకు అఖండ సక్సెస్ చాలా కీలకం. పైసా వసూల్ తర్లాత జై సింహా, కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ వంటివి బాలకృష్ణ పూర్తి స్టామినాను ప్రూవ్ చేయలేకపోయాయి. అందుకే అఖండతో గట్టిగా గర్జించాలని డిసైడయ్యారు. బోయపాటితో హ్యాట్రిక్ మూవీ కాబట్టి బాగానే బజ్ క్రియేటైంది అఖండపై. ట్రైలర్, సాంగ్స్ కూడా ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి. ఇక డిసెంబర్ 2నే రాబోతుంది కాబట్టి.. అఖండ భవిష్యత్త్ త్వరలోనే తేలిపోతుంది.

Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

నారప్ప, దృశ్యం 2 సినిమాలతో ఓటీటీ సక్సెస్ అయితే అందుకున్నారు కానీ థియేటర్ లో హిట్ కొట్టి చాలా కాలమైంది వెంకటేశ్. ఇప్పుడు వెంకీ చేతిలో ఉన్న ఏకైక థియేట్రికల్ ప్రాజెక్ట్ ఎఫ్3 మాత్రమే. అనిల్ రావిపూడి ఆల్రెడీ చూపించిన ఎఫ్ 2 హ్యూజ్ సక్సెస్ సాధించి కమర్షియల్ హిట్ కొట్టింది కాబట్టి ఎఫ్ 3పై బోలెడు అంచనాలున్నాయి. దీంతో వెంకీ హిట్ కొడతారనే అనుకుంటున్నారు. 2022 ఫిబ్రవరిలో ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.