Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ! Tollywood film festival start in December

Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

ప్రజెంట్.. టాలీవుడ్ కళకళలాడుతోంది. కొత్త సినిమా సింగిల్స్, టీజర్స్, ట్రైలర్స్ తో సందడి చేస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీలోనూ ఇంత రచ్చ జరగట్లేదంటే అది నిజం.

Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

Telugu New Films: ప్రజెంట్.. టాలీవుడ్ కళకళలాడుతోంది. కొత్త సినిమా సింగిల్స్, టీజర్స్, ట్రైలర్స్ తో సందడి చేస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీలోనూ ఇంత రచ్చ జరగట్లేదంటే అది నిజం. దీనికి కారణమైన తెలుగు ఆడియెన్స్ ను మిగిలిన ఇండస్ట్రీ వాళ్లు తెగ పొగిడేస్తున్నారు. అయితే మన ప్రేక్షకులు కూడా తక్కువేం కాదు.. కంటెంట్ ఉంటేనే కసిగా బాక్సాఫీస్ పై కాసులు కురిపిస్తున్నారు. అందుకే వీళ్లను టెంప్ట్ చేయడానికి అదిరే అస్త్రాలను వదులుతున్నారు మన మేకర్స్.

Telugu Films: టాలీవుడ్ బాట పట్టిన ఇంటర్నేషనల్ స్టార్స్!

డిసెంబర్ రావడమే ఆలస్యం. టాలీవుడ్ జాతర షురూ కాబోతుంది. వారం వారం గ్యాప్ తో వరుసగా స్టార్స్ సినిమాలు థియేటర్స్ కొచ్చేస్తాయి. వచ్చే వాళ్లు వస్తుంటే… మిగిలిన వాళ్లు ప్రమోషన్స్ తో హడావిడీ చేస్తారు. ఇంకొంతమంది వాళ్ల మూవీ టీజర్స్, సింగిల్స్ అంటూ రచ్చ చేస్తారు. ఇక కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నవాళ్లు ఆ బిజీలో ఉంటారు. ఇలా రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో అసలైన పండుగ కనిపించబోతుంది.

Pushpa: రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

బాలయ్య అఖండ, వరుణ్ తేజ్ గని, ప్రభాస్ రాధేశ్యామ్, వెంకటేష్ దృశ్యం 2, తారక్-రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్-చిరంజీవి ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, నాగార్జున బంగార్రాజు, నాగ చైతన్య థాంక్యూ, అఖిల్ ఏజెంట్, అల్లు అర్జున్ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్ లతో పాటు చిన్నా చితకా సినిమాలు ఇలా ఎన్నో ఈ డిసెంబర్ నుండి సమ్మర్ వరకు వరసగా వచ్చేస్తున్నాయి.

Sankranthi 2022: సంక్రాంతి సినిమా ఫైట్.. టాలీవుడ్ పెద్దల మంతనాలు?

వీటితో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా అప్డేట్స్, ప్రభాస్ సలార్, ఆదిపురుష్, రామ్ చరణ్ శంకర్ సినిమా, చిరంజీవి భోళాశంకర్, గాడ్ ఫాదర్, పవన్ హరిహర వీరమల్లు ఇలా రాబోయే సినిమాలకు సంబంధించిన ప్రచారాలు కూడా జనవరి నుండి మొదలు కానున్నాయి. మొత్తంగా డిసెంబర్ నుండి టాలీవుడ్ లో సినిమాల జాతర మొదలుకానుంది.

×