Anchor Shyamala: కొత్త ఇల్లు చూపించిన యాంకర్.. బాబోయ్ ఇంద్రభవనమే!

ఒకప్పుడు యాంకర్లంటే సో సో సంపాదనే అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సినీ తారలకు ఏమాత్రం తగ్గేలా లేరు. స్టార్ యాక్టర్స్ అనుభవించే స్థాయిలో యాంకర్లు కూడా విలాసవంతంగా గడిపేస్తున్నారు.

Anchor Shyamala: కొత్త ఇల్లు చూపించిన యాంకర్.. బాబోయ్ ఇంద్రభవనమే!

Anchor Shyamala

Updated On : November 30, 2021 / 10:35 AM IST

Anchor Shyamala: ఒకప్పుడు యాంకర్లంటే సో సో సంపాదనే అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సినీ తారలకు ఏమాత్రం తగ్గేలా లేరు. స్టార్ యాక్టర్స్ అనుభవించే స్థాయిలో యాంకర్లు కూడా విలాసవంతంగా గడిపేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆదాయాన్ని కూడా పోగేస్తున్నారు. తెలుగులో స్టార్ యాంకర్లుగా కొందరు క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటే మరికొందరు అడపాదపడా సినిమా ఛాన్సులతో కలిపి ఇటు టీవీ అటు సినిమా ద్వారా బాగానే వెనకేసుకుంటున్నారు.

Acharya: ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!

టాలీవుడ్‌ యాంకర్‌ కమ్ యాక్టర్ శ్యామల తెలుసు కదా.. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌ చేసే ఈ యాంకరమ్మ కొద్దిగా రాజకీయాలలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల యూట్యూబ్ ఛానెళ్లకు భారీ ఆదాయాలు వస్తుండడంతో అందరూ వాళ్ళ ఇంట్లో వేడుకలను.. శుభకార్యాలను కూడా ప్రేక్షకులతో పంచుకొని కాసులు సంపాదిస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా తాజాగా తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేసింది.

Radhe Shyam: కంప్లీట్ రొమాంటిక్‌గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!

గృహప్రవేశం వీడియో యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారగా.. శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటులు అలీ, సుమ, రాజీవ్‌ కనకాల, తనీష్‌లతో పాటు సింగర్‌ గీతా మాధురి సహా పలువురు ఈ వేడుకలలో పాల్గొన్నారు. కాగా.. శ్యామల కొత్త ఇల్లు ఇంద్రభవనంలా ఉండగా సోషల్ మీడియాలో దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. శ్యామల ఈ ఇంటి కోసం దాదాపు కోటి అరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు.