Telugu Films: కొవిడ్‌తో పోయింది పిండుకొనే పనిలో స్టార్స్!

సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరూ, యంగ్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మీడియం హీరోలలో మాస్ రాజా రవితేజ ఐదేసి సినిమాలతో జోరుమీదుంటే మూడు, నాలుగు సినిమాలతో..

Telugu Films: కొవిడ్‌తో పోయింది పిండుకొనే పనిలో స్టార్స్!

Telugu Films (1)

Telugu Films: సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరూ, యంగ్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మీడియం హీరోలలో మాస్ రాజా రవితేజ ఐదేసి సినిమాలతో జోరుమీదుంటే మూడు, నాలుగు సినిమాలతో మరో బ్యాచ్ రచ్చ చేస్తుంది. కొవిడ్ తో పొగొట్టుకున్నది రాబట్టుకోవడమే కాదు.. ఇదే టైమ్ లో పెరిగిన టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ ను వాడేసుకోవాలని గట్టిగా డిసైడయ్యారు. అందుకే తగ్గేదే లే అంటూ వరుస షూటింగ్స్ తో రప్ఫాడించేస్తున్నారు.

Telugu Films: ఒకేసారి ఐదు సినిమాలు.. ఈ నలుగురికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ట్రిపుల్ ఆర్ పూర్తి చేసారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు గుమ్మడికాయ కొట్టారు తారక్. సో ఇప్పుడైతే తారక్ ఖాళీగానే ఉన్నారు. ఫ్యామిలీతో పారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే కొరటాల కాంబోలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకెళ్లబోతుంది. కొరటాల ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేయాల్సి ఉంది యంగ్ టైగర్. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో మైత్రీ మూవీ మేకర్స్ కలయికలో ఓ సినిమా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు పాన్ ఇండియా లెవెల్లో సంజయ్ లీలా భన్సాలీతో తారక్ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూసుకుంటే తారక్ చేతిలో అఫీషియల్ గా మూడు, అనఫీషియల్ గా రెండు సినిమాలున్నాయి.

Bangarraju: చిన్న బంగార్రాజు పెద్ద బంగార్రాజుని మరిపించేస్తాడా..?

అతి త్వరలో త్రివికమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారు సూపర్ స్టార్. ఏప్రిల్ 1కి రిలీజ్ డేట్ మార్చుకున్న సర్కారు వారి పాటకు సంబంధించి ఇంకొక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పూర్తైతే.. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా…త్రివిక్రమ్ తో సెట్స్ పైకెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ ప్రకటించారు. ఆ తర్వాత కొరటాల శివతో కూడా సూపర్ స్టార్ సినిమా చేస్తే అవకాశం లేకపోలేదు.

Jr NTR: ఫిబ్రవరిలో ఒకటి.. అక్టోబర్‌లో మరొకటి!

మిగిలిన పాటల షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్. నవంబర్ ఎండింగ్ కల్లా సామ్ తో చేస్తోన్న ఐటమ్ సాంగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే నెక్ట్స్ మూవీకి కమిట్మెంట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. అయితే ఏ డైరెక్టర్ తో అన్న దానిపై పూర్తి క్లారిటీ రావట్లేదు. బోయపాటితోనా, వేణూశ్రీరామా అన్న దానిపై క్లారిటీ రావాలి. వీళ్లిద్దరితో ఒక ప్రాజెక్ట్ ను పూర్తి చేసాక మళ్లీ పుష్ప 2 సెట్స్ లో అడుగుపెడతారు ఐకాన్ స్టార్.

Raai Laxmi: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

నాని శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తి చేసిన వెంటనే దసరా మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జనవరి నుంచి పాల్గొనబోతున్నారు. తెలంగాణ సింగరేణి బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో దసరా సినిమాను ప్లాన్ చేసాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాగచైతన్య లాల్ సింగ్ చద్దా కానిచ్చేసాడు. బంగార్రాజుతో సంక్రాంతికి వచ్చేలా ఉన్నాడు. థ్యాంక్యూ సినిమా కూడా ఎండింగ్ కి వచ్చేసింది. మరోవైపు నెట్ ఫ్లిక్స్ హారర్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ లేదంటే నందినిరెడ్డితో చైతూ ప్రాజెక్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.