Tiger Nageswara Rao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పోస్ట్‌పోన్.. నిజమేనా..?

రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 20న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. అయితే..

Tiger Nageswara Rao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పోస్ట్‌పోన్.. నిజమేనా..?

Ravi Teja Tiger Nageswara Rao postponed from dussehra 2023 race

Updated On : August 1, 2023 / 4:31 PM IST

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా ఒక గజదొంగ రియల్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. ఈ మూవీతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 20న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. అయితే రిలీజ్ కి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. కానీ చిత్ర యూనిట్.. పాన్ ఇండియా మూవీకి చేయవల్సిన ప్రమోషన్స్ ఏవి చేయడం లేదు.

OMG 2 : దేవుడి సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడమా..? ‘ఓ మై గాడ్’ రిలీజ్‌కి ముందే 27 సన్నివేశాలు..!

ఈ చిత్రం నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ కాన్సెప్ట్ టీజర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. షూటింగ్ అప్డేట్స్ కూడా పెద్దగా వినిపించడం లేదు. దీంతో ఈ మూవీ దసరాకి రావడం కష్టమే అంటూ పలు మీడియా వెబ్ సైట్స్ లో వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక ఈ ఆర్టికల్స్ చూసిన రవితేజ అభిమానులు ఆందోళన చెందుతుండడంతో మూవీ టీం ఒక క్లారిటీ ఇచ్చింది. టైగర్ నాగేశ్వరరావు పోస్ట్‌పోన్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ముందు అనౌన్స్ చేసినట్లు మూవీ దసరాకే వస్తుంది అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

RGV : ఆర్జీవీ సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా? అందుకే ఇప్పుడు ఇలా ఆర్జీవీ డెన్‌తో..

దీంతో ఫేక్ వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. కాగా ఈ మూవీకి కొత్త డైరెక్టర్ వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుదేశాయ్‌, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాడా? లేదా? చూడాలి.