RGV : ఆర్జీవీ సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా? అందుకే ఇప్పుడు ఇలా ఆర్జీవీ డెన్‌తో..

డైరెక్టర్ గా ఆర్జీవీ మొదటి సినిమా 'శివ'తోనే సంచలనం సృష్టించి ఇండస్ట్రీ కళ్ళు అతని మీద పడేలా చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఆర్జీవీ.

RGV : ఆర్జీవీ సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా? అందుకే ఇప్పుడు ఇలా ఆర్జీవీ డెన్‌తో..

Ram Gopal Varma entry in Movies and now Developing RGV Den for Movies

RGV :  ఆర్జీవీ శివ(shiva) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో స్టార్ డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్జీవికి సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు, పరిచయాలతోనే సినిమాల్లోకి వచ్చాడు. ఎలాంటి ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో కోచింగ్ లకు వెళ్ళలేదు. అసలు అక్కడ ప్రాక్టికల్ గా ఏమి నేర్పించరని అతని నమ్మకం. ఆర్జీవీ వాళ్ళ నాన్న కృష్ణం రాజు వర్మ అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసేవాడు.

ఆర్జీవికి చదువు అబ్బక మధ్యలోనే వచ్చేసి జాబ్ వచ్చినా వెళ్లకుండా ఓ డివిడిలు, VCR లు రెంట్ కి ఇచ్చే షాప్ పెట్టుకొని ఉండేవాడు. సినిమాల్లోకి వెళ్లాలని బలంగా అనుకున్నాక వాళ్ళ నాన్న వద్దన్నా తనకున్న పరిచయాలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నాగార్జున అపాయింట్మెంట్ దొరకడంతో కథ చెప్పి సినిమా ఓకే చేసుకున్నాడు. అప్పటివరకు ఒక్క సినిమాకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయలేదు ఆర్జీవీ. అయితే నాగార్జున సినిమా మొదలుపెట్టడానికి టైం ఉందని, ఈ లోపు నాగార్జున చేసే ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వర్క్ నేర్చుకోమన్నారు. కానీ పట్టుమని పది రోజులు కూడా చేయకుండానే మానేశాడు ఆర్జీవీ.

ఇక డైరెక్టర్ గా ఆర్జీవీ మొదటి సినిమా ‘శివ’తోనే సంచలనం సృష్టించి ఇండస్ట్రీ కళ్ళు అతని మీద పడేలా చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఆర్జీవీ. రక్త చరిత్ర సినిమా తర్వాత తన ఇష్టం అంటూ ఇష్టమొచ్చిన సినిమాలు తీసుకుంటూ గడిపేస్తున్నాడు. అయితే ఆర్జీవీ(Rgv) ఇటీవల కొత్త ఆఫీస్ కట్టాను అంటూ ‘ఆర్జీవీ డెన్’ వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఆ ఆఫీస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా RGV డెన్ వైరల్ గా మారింది.

ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించి తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఆర్జీవీ ప్రకటించారు. ఆర్జీవీ డెన్ కి https://rgvden.com/ అనే ఒక వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో డైరెక్టర్స్, రైటర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. మిగిలిన కేటగిరీలలో కూడా త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. ట్యాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా ఆర్జీవీ కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, ఆర్జీవీ డెన్ స్థాపించి చాలా మందితో సినిమాలు తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నట్టు తెలిపాడు. ఇప్పుడు అతని డ్రీమ్ నెరవేరడానికి సమయం వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఆర్జీవీ డెన్, ఈ అవకాశాల గురించి ఆర్జీవీ వరుస పోస్టులు చేస్తూ ఈ నేపథ్యంలోనే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ అన్ని వేస్ట్ అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దానిని వివరిస్తూ ఓ పెద్ద ట్వీట్ కూడా చేసి.. అవన్నీ అనవసరం, మీ దగ్గర ట్యాలెంట్ ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఆర్జీవీ తన శివ సినిమా అప్పటి ఫోటో షేర్ చేసి.. ఈ ఫొటోలో ఉన్న నాకు శివ సినిమాతో డెబ్యూ ఇవ్వడానికి కారణం సినిమా పరిశ్రమ వ్యక్తులే. కానీ నాకంటే ఇంకా ట్యాలెంటెడ్ వ్యక్తులు ఇంకా బయట చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ ఇదే అవకాశం వచ్చి సినిమాలు చేయండి అని అన్నారు ఆర్జీవీ.

Allu Arjun : బన్నీ సరసన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ హీరోయిన్.. త్రివిక్రమ్ సినిమాలో..?

తాను ఒకప్పుడు ఇండస్ట్రీ పరిచయాలు పట్టుకొని, సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఆర్జీవీకి సినిమా అంటే ఒక వ్యసనం లాంటిది. అందుకే తనలాగా సినిమా అంటే ఇష్టం, ట్యాలెంట్ ఉన్న వాళ్ళకి, అవకాశాలు లేక తిరిగే వాళ్ళకి తానే ఒక అవకాశం కల్పిద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆర్జీవీ డెన్ స్థాపించి తనలాంటి వాళ్లకు ఒక అవకాశం ఇద్దామని రెడీ అయ్యాడు ఆర్జీవీ. దీంతో ఆర్జీవీ చేస్తున్న వరుస ప్రకటనలు, పోస్టులు టాలీవుడ్ లో రెండు రోజులుగా చర్చగా మారాయి. ఆర్జీవీ మరో కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.