Raviteja : డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కి మాస్ మహారాజ్.. అదిరిపోయిన ఎంట్రీ..

ఢీ షో ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చింది. త్వరలో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. గతంలో ఢీ ఫైనల్ ఎపిసోడ్స్ కి ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు రాగా ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ రాబోతున్నాడు. తాజాగా ఈ షో.....................

Raviteja : డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కి మాస్ మహారాజ్.. అదిరిపోయిన ఎంట్రీ..

Raviteja :  టీవీ షోలకి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా డ్యాన్స్ షోలు బాగా పాపులర్ అవుతాయి. మన తెలుగులో ఢీ పేరుతో డ్యాన్స్ షోలు సీజన్లుగా వస్తున్నాయి. ప్రస్తుతం ఢీ 14వ సీజన్ జరుగుతుంది. ప్రదీప్ యాంకర్ గా హైపర్ ఆది, అఖిల్ సార్థక్, నాయని పావని, శ్వేతా నాయిడు మెంటార్స్ గా, పూర్ణ, అనీ మాస్టర్, జానీ మాస్టర్ జడ్జీలుగా ఈ షో గత కొన్ని వారాలుగా సాగుతుంది.

Dil Raju : నేను సంక్రాంతికి వస్తానని ముందే చెప్పా.. చిరంజీవి, బాలకృష్ణే తర్వాత చెప్పారు..

ఢీ షో ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చింది. త్వరలో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. గతంలో ఢీ ఫైనల్ ఎపిసోడ్స్ కి ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్.. ఇలా పలువురు సెలబ్రిటీలు రాగా ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ రాబోతున్నాడు. తాజాగా ఈ షో నుంచి రవితేజ వచ్చిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో మాస్ మహారాజ్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఇక రవితేజ తన మార్క్ కామెడీతో అందర్నీ నవ్వించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 4న టీవీల్లో రానుంది.