Raviteja : శివకార్తికేయన్ కోసం రవితేజ.. మహావీరుడు సినిమాకి మాస్ మహారాజా స్పెషల్..

శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Raviteja : శివకార్తికేయన్ కోసం రవితేజ.. మహావీరుడు సినిమాకి మాస్ మహారాజా స్పెషల్..

Raviteja gave special voice over to Siva Karthikeyan Mahaveerudu Movie

Updated On : July 14, 2023 / 7:06 AM IST

Siva Karthikeyan :  ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలకు ఇంకో స్టార్ హీరో వాయిస్ లు ఇస్తే అది ఇంకా స్పెషల్ ఫిలిం అవుతుంది. సినిమా మార్కెటింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. గతంలో అన్ని పరిశ్రమలలోని చాలా సినిమాలకు ఇలా ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా మన మాస్ మహారాజా రవితేజ శివకార్తికేయన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు చిత్రయూనిట్. ఈ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ వాయిస్ ఓవర్ కోసం తెలుగులో రవితేజతో చెప్పించారు. తమిళ్ లో విజయ్ సేతుపతితో చెప్పించారు.

Baby Twitter Review : ‘బేబీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. అందరి మనసుల్ని కదిలించిన బేబీ..

ఇది ఇటీవలే మూడు రోజుల ముందే ప్రకటించినా కొంతమందికి తెలియకపోవడంతో సినిమా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మాస్ మహారాజా గాత్రంలో అనే టైటిల్ ని వేయడంతో రవితేజ అభిమానులు సంతోషిస్తున్నారు. సినిమాలో హీరోకి ఆకాశంలోని ఓ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ నే మన రవితేజతో చెప్పించారు.