Raviteja : సంక్రాంతికి రవితేజ ‘రావణాసుర’ ముహూర్తం

రవితేజ 70వ సినిమాకి కూడా ముహూర్తం పెట్టేశాడు. ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. రవితేజ 70వ సినిమా సుధీర్‌ వర్మ డైరెక్షన్ లో రాబోతుంది. ఈ సినిమాకి 'రావణాసుర' అనే టైటిల్ ని....

Raviteja : సంక్రాంతికి రవితేజ ‘రావణాసుర’ ముహూర్తం

Raviteja

Updated On : January 3, 2022 / 6:57 AM IST

Raviteja :   ఇండస్ట్రీలో బ‍్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కష్టపడి సొంతంగా ఎదిగిన వాళ్లలో రవితేజ ఒకరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మాస్ మహారాజ్ గా రవితేజ ప్రయాణం అందరికి ఇన్స్పిరేషన్. గత కొద్ది కాలంగా వరుస అపజయాలు ఎదురైనా నిలబడి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమాతో భారీ విజయం సాధించాడు. దీంతో ఈ ఊపు మీద మరిన్ని సినిమాలు వరుసగా అనౌన్స్ చేశాడు. ఇక త్వరలో రవితేజ నెక్స్ట్ సినిమా ‘ఖిలాడీ’ కూడా విడుదలకి రెడీగా ఉంది. ఆ తర్వాత ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

ఇదే ఊపులో రవితేజ 70వ సినిమాకి కూడా ముహూర్తం పెట్టేశాడు. ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. రవితేజ 70వ సినిమా సుధీర్‌ వర్మ డైరెక్షన్ లో రాబోతుంది. ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు. దీంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్.

KGF2 : ‘కేజీఎఫ్‌ 2’లో ఐటెం సాంగ్ ఇదేనా??

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ‘రావణాసుర’ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని సినిమా టీమ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌ వేదికగా ఉదయం 9:50 గంటలకు ముహుర్తం షాట్ ని తీయనున్నారు. ఆ తర్వాత సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.