Tiger Nageswara Rao : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు..
మాస్ మహారాజ్ స్పీడ్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ గుర్తుకు వస్తున్నాడు. ఇటీవలే రావణాసుర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కి కూడా ఎండ్ కార్డు వేయడానికి సిద్దమయ్యాడు.

Raviteja Tiger Nageswara Rao final schedule began's at vishakapatnam coastline with massive huge set
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ స్పీడ్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ గుర్తుకు వస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి కనీసం మూడు సినిమాలు రిలీజ్ చేసిన రవితేజ.. మధ్యలో ప్లాప్ లు వల్ల వేగం తగ్గించాడు. క్రాక్ సినిమా నుంచి మళ్ళీ వేగం పెంచేశాడు. గత ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన రవితేజ.. ఈ ఏడాది కూడా మూడు సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు కార్తికేయ-2 సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ ఘట్టమనేనితో కూడా ఒక సినిమా సైన్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Ravanasura: టీజర్ డేట్‌ను లాక్ చేసిన రావణాసుర.. ఎప్పుడంటే?
కాగా ఇటీవలే రావణాసుర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కి కూడా ఎండ్ కార్డు వేయడానికి సిద్దమయ్యాడు. ఈ మూవీ చివరి షెడ్యూల్ నిన్న (మార్చి 4) మొదలైనట్లు తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ కోసం విశాఖపట్నం తీరంలో దాదాపు 5 ఎకరాల్లో స్టూవర్టుపురం విలేజ్ సెట్ ని నిర్మించారు. రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే.. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశం తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
రవితేజ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. రవితేజ 71వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం 1970 కాలంలో స్టూవర్ట్‌పురం గజ దొంగగా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌గా తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత రేణూ దేశాయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#TigerNageswaraRao final schedule begins at a huge set on the coastline of Vizag??
Many More updates soon ??
Mass Maharaja @RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher @iam_RenuDesai @NupurSanon @gaya3bh @gvprakash @artkolla @MayankOfficl pic.twitter.com/fQGre5SWp9
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 5, 2023