Ravanasura: టీజర్ డేట్‌ను లాక్ చేసిన రావణాసుర.. ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజ లాస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి రెడీ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Ravanasura: టీజర్ డేట్‌ను లాక్ చేసిన రావణాసుర.. ఎప్పుడంటే?

Raviteja Ravanasura Teaser Release Date Locked

Ravanasura: మాస్ రాజా రవితేజ లాస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి రెడీ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Ravanasura : షూటింగ్ కంప్లీట్ చేసిన రావణాసుర..

కాగా, ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను వదిలింది చిత్ర యూనిట్. ‘రావణాసుర’ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ చిత్ర టీజర్‌ను మార్చి 6న ఉదయం 10.18 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈమేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్‌ను చేసింది.

Ravanasura : రవితేజ కొత్త బ్రేకప్ సాంగ్ అదిరిపోయిందిగా..

ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీరామ్, అను ఇమ్మాన్యుయెల్, మేఘ ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.