Ravanasura : రవితేజ కొత్త బ్రేకప్ సాంగ్ అదిరిపోయిందిగా..

మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అందులో ఒకటి 'టైగర్ నాగేశ్వరరావు', మరొకటి 'రావణాసుర'. కాగా రావణాసుర మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

Ravanasura : రవితేజ కొత్త బ్రేకప్ సాంగ్ అదిరిపోయిందిగా..

Ravanasura

Ravanasura : మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు ఆ మూవీతో కెరీర్ లోనే మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అందులో ఒకటి ‘టైగర్ నాగేశ్వరరావు’, మరొకటి ‘రావణాసుర’. ఈ రెండు చిత్రాలు పక్కా మాస్ ఎలెమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Ravanasura : రావణాసుర గ్లింప్స్ రిలీజ్.. హీరోలు ఉండరు.. రవితేజ విలనా??

కాగా రావణాసుర మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘రావణాసుర యాంతం’ అంటూ రిలీజ్ చేసిన సాంగ్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మూవీలోని మరో మ్యూజిక్ ట్రాక్ ని విడుదల చేశారు మేకర్స్. ‘ప్యార్ లోన పాగలే’ అనే బ్రేకప్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగుంజ్ పాడాడు. కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించాడు. పూర్తి సాంగ్ ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాని స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ వంటి తారలు రవితేజ పక్కన మెరబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజ తన సొంత బ్యానర్ ఆర్ టి టీం వర్క్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 7న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకొని రవితేజ సక్సెస్ ట్రాక్ ని కొనసాగిస్తాడా? లేదా? చూడాలి.