Ravanasura : షూటింగ్ కంప్లీట్ చేసిన రావణాసుర..

మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Ravanasura : షూటింగ్ కంప్లీట్ చేసిన రావణాసుర..

Raviteja Ravanasura movie shooting complete

Ravanasura : మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ఇటీవలే ధమకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కెరీర్ లో మొదటి 100 కోట్ల కలెక్షన్స్ ని కూడా అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా కీలకమైన పాత్ర పోషించి హిట్టు కొట్టాడు. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ఈ సక్సెస్ ట్రాక్ ని ఇలానే కంటిన్యూ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు.

Ravanasura : రవితేజ కొత్త బ్రేకప్ సాంగ్ అదిరిపోయిందిగా..

జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ.. శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన మూవీ టీం ఇప్పటికే మూవీలోని సాంగ్స్ తో, వీడియో గ్లింప్స్ తో ఆకట్టుకుంటుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఇక ఈ చిత్రాన్ని స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ వంటి తారలు రవితేజ పక్కన మెరబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజ తన సొంత బ్యానర్ ఆర్ టి టీం వర్క్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకొని రవితేజ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తాడా? లేదా? చూడాలి.