Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?

Realme C30 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరసమైన ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలో రానుంది. కొత్త నివేదిక ప్రకారం.. కంపెనీ C-సిరీస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేయనుంది.

Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?

Realme C30 Budget Phone Tipped To Launch In India Soon (2)

Realme C30 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరసమైన ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలో రానుంది. కొత్త నివేదిక ప్రకారం.. కంపెనీ C-సిరీస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేయనుంది. Realme C30ని త్వరలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే భారత్‌లో Realme C31 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీనికి రానున్న Realme C30 స్మార్ట్ ఫోన్ ట్రిమ్-డౌన్ వెర్షన్ కావచ్చు. Realme C30 స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి లీక్‌లు లేవు. అందుకే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లను ఊహించడం కొంచెం కష్టమే. Realme C30 RAM స్టోరేజ్ ఏయే కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందో నివేదిక వెల్లడించింది.

MySmartPrice ప్రకారం.. Realme C30 డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ, బ్యాంబూ గ్రీన్ కలర్లలో రావచ్చు. ఈ ఫోన్ ఏ డిజైన్ లేదా ప్యాటర్న్‌ని ఫీచర్ చేస్తుందో ఖచ్చితంగా తెలియదు. కానీ, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన C-సిరీస్‌.. నో-ఫ్రిల్స్ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. Realme C30లో 2GB, 3GB RAM ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. బడ్జెట్ ఫోన్‌గా రానుంది. రెండు ర్యామ్ వేరియంట్‌లకు స్టోరేజ్ 32GB స్టోరేజీతో రానుందని నివేదిక తెలిపింది. Realme C30 గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

Realme మార్చిలో భారత మార్కెట్లో Realme C31ని లాంచ్ చేసింది. అత్యంత సరసమైన Android ఫోన్‌లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ Realme C31 పెద్ద డిస్‌ప్లేతో పవర్ ఫుల్ ప్రాసెసర్ తో వచ్చింది. లైఫ్ లాంగ్ బ్యాటరీని అందిస్తుంది. Realme C30 స్మార్ట్ ఫోన్ వద్దనుకుంటే.. మీరు Realme C31ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ. 8,999గా ఉంది.

Realme C30 Budget Phone Tipped To Launch In India Soon

Realme C30 Budget Phone Tipped To Launch In India Soon

Realme C31 స్పెసిఫికేషన్‌లు ఇవే :

Display : Realme C31 HD రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల Full Screen డిస్‌ప్లే అందించారు. 88.7% స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. 16.7 మిలియన్ కలర్లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ కావడంతో డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. అంటే స్క్రోలింగ్ యానిమేషన్ నార్మల్ గా ఉంటుంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్క్రీన్‌కి మాత్రం గుడ్ టచ్ రెస్పాన్స్ ఉండేలా చేస్తుంది.

Processor : Realme C31 పవర్ 1.82GHz వరకు అందిస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T612 ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్‌సెట్ 12nm ప్రాసెస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. గ్రాఫిక్స్ పరంగా చూస్తే.. ప్రాసెసర్ ARM Mali-G57 GPUని ఉపయోగించారు.

RAM Storage : Realme C31 రెండు RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 3GB RAM, 32GB స్టోరేజ్ వేరియంట్. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌కి గరిష్టంగా 1TB మైక్రో SD కార్డ్‌ని యాడ్ చేసుకోవచ్చు.

Cameras : Realme C31 వెనుక 3 కెమెరాలు ఉన్నాయి. GT2 Proల మాదిరిగానే డిజైన్‌ F2.2 ఎపర్చరుతో 13-MP ప్రైమరీ కెమెరా, F2.4 ఎపర్చర్‌తో కూడిన మాక్రో కెమెరా అమర్చారు. గ్రాఫిక్స్ రిజల్యూషన్‌తో బ్లాక్ -వైట్ కెమెరాలు ఉన్నాయి. కానీ, F2.8 ఎపర్చరుతో సెల్ఫీలకు 5-MP F2.2 కెమెరా ఉండొచ్చు. ఇది పంచ్-హోల్ లోపల ఉంటుంది.

Battery : Realme C31 5000mAh బ్యాటరీతో వచ్చింది. ఈ బ్యాటరీ 10W ఛార్జింగ్‌‌కు సపోర్టు ఇస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌కి దాదాపు 2 గంటల సమయం పట్టవచ్చు. 10W ఛార్జర్ ఫోన్‌తోనే వచ్చింది.

Operating System : Realme C31 ఆండ్రాయిడ్ 11 రన్ అవుతుంది. కానీ, కంపెనీ సొంత Realme UIR ఎడిషన్‌తోనే రన్ అవుతుంది.

Read Also : Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?