Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Realme Narzo 50 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి Narzo 50 5G సిరీస్ మొదటి సేల్ మొదలైంది. భారత మార్కెట్లో మే 24 (మంగళవారం) నుంచి Narzo 50 5G ఫస్ట్ సేల్ అందుబాటులో ఉండనుంది.

Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Realme Narzo 50 5g First Sale In India Today Price, Specifications

Realme Narzo 50 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి Narzo 50 5G సిరీస్ మొదటి సేల్ మొదలైంది. భారత మార్కెట్లో మే 24 (మంగళవారం) నుంచి Narzo 50 5G ఫస్ట్ సేల్ అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే Realme తమ Narzo 50 సిరీస్‌ నుంచి రెండు ఫోన్‌లను రిలీజ్ చేసింది. Realme Narzo 50 5G, Realme Narzo 50 Pro 5G.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా బడ్జెట్, మిడ్‌రేంజ్ కేటగిరీలో లాంచ్ అయ్యాయి. వీటిలో Realme Narzo 50 5G ఈరోజు నుంచి ఫస్ట్ సేల్ మొదలైంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో స్పెషల్‌గా అందుబాటులో ఉంటుంది. Realme India, VP, Realme ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్, VP, CEO మాధవ్ షేత్, రియల్‌మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ ఇద్దరూ కొత్త నార్జో 50 సిరీస్ ఫోన్ గురించి మాట్లాడుతూ.. యువకులను మరింత ఆకట్టుకునేలా ఈ Narzo 50 సిరీస్ రూపొందించామని అన్నారు. Narzo 50 5G MediaTek 810 5G ప్రాసెసర్‌తో వచ్చింది. Realme Narzo 50 Pro 5G, Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ప్రదర్శన, అధునాతన డిజైన్, భారీ బ్యాటరీతో యువ గేమర్లకు మరింత ఆకర్షించనుంది.

Realme Narzo 50 5g First Sale In India Today Price, Specifications (1)

Realme Narzo 50 5g First Sale In India Today Price, Specifications

Realme Narzo 50 5G : ధర ఎంతంటే :
Realme Narzo 50 5G ప్రారంభ ధర (4GB+64GB) వేరియంట్ రూ. 15,999గా ఉంది. 4GB+128GB ధర రూ. 16,999, 6GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్ హైపర్ బ్లూ, హైపర్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

Realme Narzo 50 5G: స్పెసిఫికేషన్‌లు :
Realme Narzo 50 5G బడ్జెట్ ఫోన్ ఆఫర్.. అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. Realme Narzo 50 5G గరిష్టంగా 180 Hz నమూనా రేటుతో 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 810తో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చింది. కెమెరాల విషయానికి వస్తే.. Narzo 50 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందించారు. ఇందులో సెన్సార్‌లతో పాటు 48-MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం 8-MP కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?