రేణూ దేశాయ్.. మళ్లీ ప్రేమలో పడ్డారట!!

రేణూ దేశాయ్.. మళ్లీ ప్రేమలో పడ్డారట!!

Renu Desai: మరోసారి వార్తల్లోకి వచ్చారు రేణూ దేశాయ్.. కొన్నేళ్ల క్రితమే సిల్కర్ స్క్రీన్‌కు దూరమైనా అభిమానులకు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సోషల్ మీడియా ద్వారా ద‌గ్గ‌ర‌గానే ఉంటున్నారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తున్నారు. అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో విడిపోయిన త‌ర్వాత ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలిసి పూణేలో ఉంటున్నారు.

తాజాగా ప్రేమ‌లో పడ్డట్లు ఓ అప్‌డేట్ ఇచ్చారామె. మూడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన తర్వాత ఆమెపై ప‌వ‌న్ అభిమానులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్‌లో వేరెవరో జోక్యం ఏంట‌ని రేణూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు కూడా. ఆ త‌ర్వాత రెండో పెళ్లి ఊసేలేదు.

ఇదిలా ఉంటే అధికారికంగా ప్రేమ‌లో ప‌డ్డట్టు రేణూదేశాయ్ వెల్లడించారు. ప్లూటో అనే ప్రాణితో ప్రేమలో ఉన్నానని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్ల పేరు అది అని ఆశ్చర్యపరిచారు. ప్ర‌ముఖ న‌టి అక్కినేని అమ‌ల మాదిరిగానే రేణూ కూడా జంతు ప్రేమికురాల‌నే విష‌యం తెలిసిందే. రేణూ ఇంట్లో పిల్లులతో పాటు కుక్క‌లు కూడా బోలెడు ఉన్నాయి.