iPhones Battery : మీ ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయలా? వారంటీ ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే భారీగా చెల్లించాల్సిందే..!

iPhones Battery : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ బ్యాటరీలను రీప్లేస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఐఫోన్ బ్యాటరీ వారంటీ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి.

iPhones Battery : మీ ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయలా? వారంటీ ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే భారీగా చెల్లించాల్సిందే..!

Replacing battery for out-of-warranty iPhones will now get costlier

iPhones Battery : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ బ్యాటరీలను రీప్లేస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఐఫోన్ బ్యాటరీ వారంటీ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే.. వారంటీ లేని ఐఫోన్ బ్యాటరీలను రీప్లేస్‌మెంట్ చేయాలంటే అధిక మొత్తంలో ధరను చెల్లించాల్సి ఉంటుంది. 2022 ఏడాది చివర్లో ఐఫోన్ 14 కన్నా పాత అన్ని ఐఫోన్ మోడళ్లకు వారంటీ లేని ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ల ధరను భారీగా పెంచుతున్నట్లు ఆపిల్ ప్రకటించింది.

మీ ఐఫోన్ 13 (iPhone 13) మోడల్ వారంటీ ముగిసినప్పటికీ.. మీరు చెల్లించాల్సిన మొత్తం కన్నా అధిక మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం అమలలో ఉన్న వారంటీ బ్యాటరీ సర్వీసు రుసుము ఫిబ్రవరి 2023 చివరి వరకు మాత్రమే వర్తిస్తుంది. మార్చి 1, 2023 నుంచి వారంటీ దాటిన బ్యాటరీ సర్వీస్ రుసుము ముందుగా అన్ని iPhone మోడల్‌లకు 20 డాలర్లు (సుమారు రూ. 1654) పెరగనుంది. iPhone 14 మోడల్ Apple తన సపోర్టు పేజీలో పేర్కొంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ కొత్త A17 చిప్‌, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో రానున్న ఐఫోన్ 15 మోడల్..!

ప్రస్తుతం, Apple చాలా iPhone మోడల్‌లలో బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కోసం అమెరికాలో 69 డాలర్లు, భారత మార్కెట్లో దాదాపు రూ.7000 వసూలు చేస్తోంది. వెబ్‌సైట్‌లో అంచనా ధర మాత్రమే.. మీ ఐఫోన్ మోడల్ బ్యాటరీలో తీవ్రమైన సమస్యలు ఉన్నట్లయితే.. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధర ఎక్కువ కావొచ్చు.

Replacing battery for out-of-warranty iPhones will now get costlier

Replacing battery for out-of-warranty iPhones

AppleCare, Applecare+ సబ్‌స్క్రిప్షన్ లేని వినియోగదారులపై మాత్రమే ధరల పెంపు ప్రభావం పడుతుందని గమనించాలి. AppleCare+ సబ్‌స్క్రిప్షన్‌ని కలిగిన వినియోగదారులు తమ ప్రొడక్టు బ్యాటరీ అసలు సామర్థ్యంలో 80 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లయితే.. వారి iPhone బ్యాటరీని ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రీప్లేస్ చేయవచ్చు.

ప్రతి iPhone పరిమిత వారంటీతో 90 రోజుల వరకు కాంప్లిమెంటరీ టెక్నికల్ సపోర్ట్ ద్వారా ఒక ఏడాది హార్డ్‌వేర్ రిపేర్ కవరేజీతో వస్తుంది. iPhone యూజర్లలో AppleCare+ మీ AppleCare+ కొనుగోలు తేదీ 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు కవరేజీని పొడిగిస్తుంది. యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. ప్రతి సంఘటనకు స్క్రీన్ లేదా బ్యాక్ గ్లాస్ డ్యామేజ్ అయినందుకు రూ. 2500 సర్వీస్ ఫీజు లేదా ఇతర యాక్సిడెంటల్ డ్యామేజ్ ధరను రూ. 8900 చెల్లించాల్సి ఉంటుందని సపోర్ట్ పేజీ పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!