సుశాంత్ మరణంపై సల్మాన్ ఖాన్ Tweet..ఏమన్నాడంటే

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 05:00 AM IST
సుశాంత్ మరణంపై సల్మాన్ ఖాన్ Tweet..ఏమన్నాడంటే

బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు నటులు చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ తో పటు ఇతర నటులను అన్ ఫాలో చేసేస్తున్నారు.

సుశాంత్ కు మద్దతుగా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టార్స్ కుటుంబాలకు అవకాశం ఇస్తూ..ఎలాంటి సపోర్టు లేకుండా..కెరీర్ ఉన్న వారిని తొక్కేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇందులో ప్రధానంగా సల్మాన్ ఖాన్ పై సుశాంత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొదటిసారిగా సల్మాన్ రెస్పాండ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. సుశాంత్ అభిమానులు ఉపయోగించిన భాష గురించి కానీ.. శాపనార్థాల గురించి కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్విట్టర్ లో కోరాడు. ఎంతో అభిమానించే ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. తన అభిమానులంతా సుశాంత్ కుటుంబం.. అతని అభిమానుల పక్షాన నిలబడాలి అని సల్మాన్ సూచించారు.

 

Read:  తమిళనాడులో సీఎం జగన్ ఫొటోలు : నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?