RGV : స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై ఆర్జీవీ.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

కేజీయఫ్‌ సక్సెస్‌ని స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. ఇటీవల కాలంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే.....

RGV : స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై ఆర్జీవీ.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Rgv (1)

 

RGV :  తనదైన శైలిలో ఎప్పుడూ ట్వీట్స్ తో ఏదో ఒక సంచలనం సృష్టిస్తాడు వర్మ. అన్నిటికి, అందరికి వ్యతిరేకంగా, నెగిటివ్ గా, సెటైరికల్ గా ట్వీట్స్ చేసే ఆర్జీవీ గత కొద్ది కాలంగా మాత్రం పాజిటివ్ గా, ఆలోచించే విధంగా అందరిలాగే మంచి మంచి ట్వీట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవల సక్సెస్ సాధిస్తున్న అన్ని సినిమాలని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నాడు. మరోపక్క ఈ సక్సెస్ లని పొగుడుతూ బాలీవుడ్ ని విమర్శిస్తూ కూడా ట్వీట్స్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, పుష్ప, ఇప్పుడు కేజీయఫ్‌-2 సినిమాల సక్సెస్ లపై పాజిటివ్ గా ట్వీట్స్ వేస్తూనే బాలీవుడ్ ని ఉద్దేశించి సెటైరికల్ గా కూడా ట్వీట్స్ వేస్తున్నాడు.

 

కేజిఎఫ్ 2 కి వచ్చిన కలెక్షన్స్ బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ అంటూ ట్వీట్ చేసిన ఆర్జీవీ. తాజాగా మరో ట్వీట్ చేశాడు. కేజీయఫ్‌ సక్సెస్‌ని స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ ట్వీట్‌ చేశారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే చెప్పనవసరం లేదు. తాజాగా కేజిఎఫ్ సినిమాని ఉద్దేశిస్తూ ఆర్జీవీ.. ”సినిమా మేకింగ్‌పై ఎంత ఎక్కువ డబ్బులు పెడితే, అంత మంచి చిత్రాలు బయటకు వస్తాయని చెప్పడానికి కేజీయఫ్‌-2 సినిమానే ఉదాహరణ. మేకింగ్‌లో ఎంత క్వాలిటీ ఉంటే, అంత భారీ సక్సెస్‌ వస్తుంది. అంతేకానీ స్టార్‌ హీరోలకు భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వడం అనేది వృధా” అంటూ ట్వీట్‌ చేశాడు.

RGV : అసలే సౌత్ సక్సెస్‌పై కుళ్ళుకుంటున్న బాలీవుడ్.. ట్వీట్స్‌తో మరింత రెచ్చగొడుతున్న ఆర్జీవీ..

 

దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. సినీ ప్రేమికులైతే ఆర్జీవీ చెప్పింది అక్షరాలా సత్యం అంటున్నారు. అయితే ఇదే ఆర్జీవీ గతంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్లపై మరోలా కామెట్స్ చేశారు. గతంలో ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించి, హీరోల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ లో లెక్కలోకి రాదు అని ఏపీ మంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు దానిపై ఆర్జీవీ స్పందిస్తూ.. ”సినిమాకి జనాలు వచ్చేదే హీరోని చూసి, ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకి జనాలు వాళ్ళని చూసే వస్తారు, వాళ్ళు ఉంటేనే సినిమాకి డబ్బులు వస్తాయి. హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన పర్లేదు, వాళ్ళ మీద పెట్టుబడి పెడితేనే డబ్బులు రిటర్న్ వస్తాయి” అని అన్నారు.

Vivek Agnihotri : మొన్న కశ్మీర్ ఫైల్స్.. రేపు ఢిల్లీ ఫైల్స్..

అప్పుడేమో ఇలా హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వొచ్చు అని, ఇప్పుడేమో రెమ్యునరేషన్ తగ్గస్తే బెటర్ అని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. అయితే ఈ రెండు కూడా నిజమే. పరిస్థితులని, సినిమాని, కథని బట్టి రెండూ కూడా సినిమాలకి వర్తిస్తాయి అని అంటున్నారు సినీ ప్రేక్షకులు.