బాలయ్య బాబు కూడా నాలాగే.. ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ..

  • Published By: sekhar ,Published On : July 2, 2020 / 01:37 PM IST
బాలయ్య బాబు కూడా నాలాగే.. ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ..

కాంట్రవర్సీ కింగ్ రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘నగ్నం’ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది హీరోయిన్ స్వీటీ. ఆ సినిమాలో బీభత్సమైన బోల్డ్‌గా నటించి, మగజాతికి మత్తెక్కించింది. స్వీటీగా వర్మ పరిచయం చేసిన ఆమె అసలు పేరు శ్రీ రాపాక. ఈమె తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో మంది టాప్ హీరోలతోనూ, హీరోయిన్లతోనూ పనిచేసిందట.

SREE

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో నటసింహా నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీ. ‘కాస్ట్యూమ్ డిజనర్‌గా నేను చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేశాను. ఓ సారి డిస్కషన్ కోసం నందమూరి బాలకృష్ణగారి ఇంటికి వెళ్లా. ఆయనకు కోపం ఎక్కువని అందరూ అంటారు కదా! కానీ, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. క్లీన్ మెంటాలిటీ. కాకపోతే నాలాగే కాస్త షార్ట్ టెంపర్. త్వరగా కోపం వచ్చేస్తుంది. వెంటనే చల్లారిపోతుంది. మహిళలతో ఆయన చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు’ అని చెప్పింది శ్రీ అలియాస్ స్వీటీ.

Read:జెనీలియా దంపతుల నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న జనం..