Ajay Jadeja: “పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు.. అతనిలా చేయలేడు”

ఐపీఎల్‌ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ కు ఓ సలహా ఇచ్చాడు.

Ajay Jadeja: “పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు.. అతనిలా చేయలేడు”

Pant Dhoni

Updated On : May 12, 2022 / 5:02 PM IST

.

Ajay Jadeja: ఐపీఎల్‌ 2022వ సీజన్లో ఆరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. రిషబ్ పంత్ కు ఓ సలహా ఇచ్చాడు.

అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పంత్ కలిసి ధోనీ సలహాలు వింటున్న సోషల్ మీడియా పిక్ పై స్పందిస్తూ జడేజా కామెంట్ చేశాడు.

పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై సూచనలు తీసుకోగలడు కానీ, అలా చేయలేడని జడేజా అంటున్నాడు.

Read Also: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”

పంత్ కు నా ఏకైక సలహా ఏంటంటే.. ధోనీ తన వయస్సులో చేసినట్లుగా పంత్ ఇప్పుడు చేయాలి. అలా ఇప్పుడేం జరగడం లేదు. యువ క్రికెటర్ అయినా.. తానేదో సీనియర్ ప్లేయర్ లా ఫీల్ అవుతున్నాడు. ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతని మీద చాలా అంచనాలు ఉంటాయని వివరించాడు జడేజా.