Rishabh Pant: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”

ప్రస్తుత IPL 2022లో 9మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4గెలిచి 5ఓడినప్పటికీ +0.587 నెట్ రన్‌రేట్ తో కొనసాగుతుంది. గత సీజన్ మాదిరి ఫామ్ కనబరచకపోయినప్పటికీ ఢిల్లీ ప్లేయర్ల ప్రదర్శన ఆకర్షణీయవంతంగానే ఉంది.

Rishabh Pant: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”

Rishab Pant

Updated On : May 5, 2022 / 1:46 PM IST

 

 

Rishabh Pant: ప్రస్తుత IPL 2022లో 9మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4గెలిచి 5ఓడినప్పటికీ +0.587 నెట్ రన్‌రేట్ తో కొనసాగుతుంది. గత సీజన్ మాదిరి ఫామ్ కనబరచకపోయినప్పటికీ ఢిల్లీ ప్లేయర్ల ప్రదర్శన ఆకర్షణీయవంతంగానే ఉంది. రీసెంట్‌గా జరిగిన కోల్‌కతాతో మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ చేతన్ సకారియా మూడు ఓవర్లు బౌలింగ్ వేసి 17పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన ఆరోన్ ఫించ్ వికెట్ కూడా పడగొట్టాడు.

అభిమానులతో పాటు నిపుణులు సైతం సకారియా ప్రదర్శనకు ప్రశంసలు కురిపించారు. ఈ పేసర్ మాత్రం తన కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ రిషబ్ పంత్ లపై కాంప్లిమెంట్లు కురిపిస్తున్నాడు. పంత్ డ్రెస్సింగ్ రూంలో చూపించే తీరు ప్లేయర్లు కంఫర్టబుల్ గా ఉండేందుకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు. ఇక పాంటింగ్ ప్లేయర్లతో పర్సనల్ గా చర్చించి కాన్ఫిడెన్స్ ను బూస్ట్ చేస్తుంటాడని వివరించాడు.

“చాలా కాలం నుంచి ఢిల్లీ జట్టుకు ఆడుతున్నా. రిక్కీ పాంటింగ్ ఆలోచనలకు ఇంప్రెస్ అయిపోయా. కీలకమైన పరిస్థితులు వచ్చినప్పుడు పాంటింగ్ ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోక్ లు వేసి డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని మారుస్తాడు. ప్లేయర్లను ఒక్కొక్కరితో మాట్లాడి మ్యాచ్ కు రెడీ చేస్తాడు”

Read Also : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

“రిషబ్ భయ్యా చాలా ప్రశాంతంగా ఉండి.. ఒత్తిడి, బాధ్యత అంతా తానే తీసుకుంటాడు. జట్టు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇతర ప్లేయర్లు బాగా ఆడినప్పుడు క్రెడిట్ ఇచ్చేస్తాడు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సమస్య నుంచి గట్టెక్కించేందుకు తానే ముందుంటాడు” అని చేతన్ సకారియా అన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకూ 9మ్యాచ్ లు ఆడి 4 గెలిచి, 5 ఓడింది. ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.