Producer Venkat: ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత వెంకట్ కన్నుమూశారు. ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ అధినేత వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో..

Producer Venkat: ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత కన్నుమూత

Producer Venkat

Updated On : September 27, 2021 / 10:51 AM IST

Producer Venkat: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత వెంకట్ కన్నుమూశారు. ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ అధినేత వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (సోమవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు.

Big Boss 5: దేవతలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్‌ ఇచ్చిన బ్యూటీ!

ఆర్‌ఆర్‌ బ్యానర్ పై వెంకట్ ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. వెంకట్ కేవలం తెలుగులో కాదు.. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘డైవర్స్ ఇన్విటేషన్’ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఆహ్వానం సినిమాకి ఇది రీమేక్.

Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?

వెంకట్ హిందీలో కూడా ఏక్ హసీనా తి అనే రొమాంటిక్ సినిమాతో పాటు తెలుగులో ఎన్నో సినిమాలను డిస్టిబ్యూట్ చేశారు. వెంకట్ ఇత‌రుల‌తో క‌లిసి నిర్మాత‌గా ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై 14 సినిమాలను నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు చేశారు. వెంకట్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.