Gorati Venkanna : తెలంగాణ కవి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

మొత్తం 20 భాషల్లో పద్య, కవిత, చిన్న కథలు, నవలలు, జీవిత చరిత్రలు, విమర్శ విభాగాలకు అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 

Gorati Venkanna : తెలంగాణ కవి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Gorati Venkanna

Gorati Venkanna : తెలంగాణ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2021 సంవత్సరానికి గాను పురస్కారాలను ప్రకటించింది కేంద్ర సాహిత్య అకాడమీ. కవిత్వ విభాగంలో ‘వల్లంకి తాళం’ రచనకు గాను.. గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక చేసింది అకాడమీ.

మరో కవి తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ‘దండకడియం’ రచనకు గాను ఈ అవార్డు వరించింది. కేంద్ర బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ అనే నాటక రచనకు ఈ పురస్కారం దక్కింది.

మొత్తం 20 భాషల్లో అవార్డులు ఇచ్చారు. పద్య, కవిత, చిన్న కథలు, నవలలు, జీవిత చరిత్రలు, విమర్శ విభాగాలకు అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 7 కవితా పుస్తకాలు, 2 నవలలు, 5 షార్ట్ స్టోరీస్, 2 నాటకాలు, జీవిత చరిత్ర, ఆత్మ కథ, విమర్శ, పురాణ కవిత్వం కేటగిరీల్లో ఒక్కొక్కరికి అవార్డు అందజేశారు.

Read Also : Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్