Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..

పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ లాంటి ఐటెం లేదా స్పెషల్ సాంగ్స్ ఆఫర్ వస్తే చేస్తారా అని అడగడంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ''ఐటెం సాంగ్స్‌ నాకు...........

Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..

Sai Pallavi

Sai Pallavi :  మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకొని ఫిదా సినిమాతో అభిమానుల్ని సంపాదించుకొని పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి వరుస హిట్ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి ఎంతో మంది యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది సాయి పల్లవి. తన నటనతో, డ్యాన్స్ తో అందర్నీ ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూనే ఉంది. అందరి హీరోయిన్స్ లా మేకప్ లు వాడకపోవడం, చాలా సాంప్రదాయంగా, సింపుల్ గా, పద్దతిగా ఉండటంతో మరింతమంది ఆమెని అభినందిస్తున్నారు.

చాలా స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ, ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ మిగతా హీరోయిన్స్ కి నేను చాలా డిఫరెంట్ అంటుంది సాయి పల్లవి. ఇక ఎన్ని డబ్బులిచ్చినా కొన్ని ప్రకటనలు, ఐటెం సాంగ్స్ లాంటివి చేయను అని గతంలోనే చెప్పింది. అందుకే సాయి పల్లవి అంటే అందరికి ఇష్టం. ప్రస్తుతం సాయి పల్లవి జులై 1న విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి ఐటెం సాంగ్స్ ప్రస్తావన రావడంతో వాటి గురించి మాట్లాడింది సాయి పల్లవి.

Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?

ఇంటర్వ్యూలో పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ లాంటి ఐటెం లేదా స్పెషల్ సాంగ్స్ ఆఫర్ వస్తే చేస్తారా అని అడగడంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ”ఐటెం సాంగ్స్‌ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇస్తాము అని భవిష్యత్తులో ఆఫర్స్ వచ్చినా చేయననే చేప్తాను. ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ కరెక్ట్ గా ఉండకపోతే నచ్చదు. ఆ సాంగ్స్ లో వేసే బట్టలు నాకు సెట్ అవ్వవు. డ్రెస్సింగ్ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు” అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. డబ్బులకోసం ఎలాంటి సినిమాలు, సీన్స్, యాడ్స్ చేయడానికి అయినా రెడీగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు, అందుకే అందరికి సాయి పల్లవి అంటే ప్రత్యేక అభిమానం.