Samantha : ఒకసారి రిలేషన్ బ్రేకప్ అయినంత మాత్రాన నేను అలా మారిపోను..

సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొన్ని రోజులు తన సోషల్ మీడియాలో కొటేషన్స్ పోస్ట్ చేసినా ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. తనపై ఈ విషయంలో వచ్చిన రూమర్స్ ని మాత్రం ఖండించింది. ఇక ప్రేమ, రిలేషన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.................

Samantha : ఒకసారి రిలేషన్ బ్రేకప్ అయినంత మాత్రాన నేను అలా మారిపోను..

Samantha comments on love and relation in a bollywood interview goes viral

Samantha :  సమంత(samantha) ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఓ పక్క వరుస సినిమాల షూటింగ్స్ తో, మరోపక్క శాకుంతలం(Shakunthalam) సినిమా(cinema) ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఏప్రిల్ 14న సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా పాన్ ఇండియా(Pan India) సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దీంతో సమంత గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. బాలీవుడ్(Bollywood) లో కూడా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ గా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత ప్రేమ(Love) గురించి మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొన్ని రోజులు తన సోషల్ మీడియాలో కొటేషన్స్ పోస్ట్ చేసినా ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. తనపై ఈ విషయంలో వచ్చిన రూమర్స్ ని మాత్రం ఖండించింది. ఇక ప్రేమ, రిలేషన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఏం తప్పనిసరి కాదు. నాకు గత ఎనిమిది నెలలుగా సపోర్ట్ నిలిచిన వారందరు వారి ప్రేమను నాకు అందిస్తున్నారు. నా దగ్గర కూడా వారికి ఇవ్వడానికి చాలా ప్రేమ ఉంది. నేను ఇప్పటికి అందరితో ప్రేమగానే ఉంటాను. ఒక రిలేషన్ బ్రేక్ అయిందని నేను విరక్తి చెందడం, ప్రేమ మీద నమ్మకం లేకపోవడం, నేను మారిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదు అని తెలిపింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Naga Chaitanya – Sobhita : నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ డేటింగ్ నిజమేనా?.. నెల క్రితమే బయటపెట్టిన చెఫ్.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో..

ఇక సినిమాలో తాను చేసిన శాకుంతలం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళ క్రితం క్యారెక్టర్ అయినా చాలా ఆధునికంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు కరెక్ట్ గా సరిపోతుంది. నా క్యారెక్టర్ కి కొంచెం దగ్గరగానే శాకుంతలం పాత్ర ఉంటుంది. చాలా కష్టాలు ఎదుర్కొంటుంది, స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి, సామాజిక నిబంధలను వ్యతిరేకిస్తుంది. వీటన్నిటికీ నేను కనెక్ట్ అయ్యాను. నన్ను ఎంపిక చేసుకున్న ఈ క్యారెక్టర్ మీ అందరికి నచ్చుతుంది అని తెలిపింది.