Statue Of Equality : “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం.. శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ

అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 216 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా MLA డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నిర్వహణలో.....

Statue Of Equality : “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం.. శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ

Samatha Poorthi

Statue Of Equality :  శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ శివారులో నిర్మించిన ముచ్చింతల్‌ ఆధ్మాత్మిక కేంద్రంలో భగవత్‌ శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న భగవత్‌ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2న తెలంగాణ సీఎం కేసీఆర్, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభించనున్నారు.

అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 216 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా MLA డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నిర్వహణలో, కాకతీయ ఇన్నోవేటివ్ అధినేతలు లక్ష్మణ్ మురారి & రమేష్ గార్ల ఆధ్వర్యంలో రూపొందించబడిన ‘శ్రీరామనుజం సమతా స్ఫూర్తి’ అనే ప్రత్యేక ఆధ్యాత్మిక గీతాన్ని కృష్ణవేణి మల్లావజ్జలగారు రచించగా, ప్రముఖ శాస్త్రీయ, సినీ సంగీత దర్శకులు గాయకులు నిహాల్ కొండూరి గారు సంగీత దర్శకత్వం వహించి ఆలపించారు.

Samatamoorthy Statue : సమతాస్ఫూర్తి కేంద్రానికి వెళ్లే దారులు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శ్రీమాన్ త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా లక్ష్మణ్ మురారి టీమ్ రూపొందించిన “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం విడుదల అయింది. ఈ ప్రత్యేక గీతాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ వారు ఆవిష్కరించి టీమ్ ను అభినందించారు