Samatamoorthy Statue : సమతాస్ఫూర్తి కేంద్రానికి వెళ్లే దారులు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి...అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు...

Samatamoorthy Statue : సమతాస్ఫూర్తి కేంద్రానికి వెళ్లే దారులు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Samatamurthi

Samatamoorthy Statue : శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అష్టాక్షరీమంత్ర జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమయ్యింది. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ముస్తాబయ్యింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరగనుంది. వెయ్యి 35 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటారు.

Read More : Tirupati : నెరవేరబోతున్న తిరుపతి నగర వాసుల కల

ఈ వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రజల సౌకర్యార్ధం #TSRTCBuses ద్వారా భక్తులకు రవాణ సదుపాయం కల్పించనున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ముచ్చింతల్ కు #TSRTCSpecialBuses ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు, ఆసక్తిగల ప్రజలు మరియు ముచ్చింతల్ ను సందర్శించాలనుకునేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 455 నెంబర్ ఎక్కి శంషాబాద్ చేరుకోవచ్చు. లేదా ఉప్పల్ చేరుకుని..అక్కడ 300 నెంబర్ బస్సు ఎక్కి ఆరాంఘర్ కు చేరుకొనే అవకాశం ఉంది. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా తొండుపల్లి, ఘాన్సిమాయా గూడ, పెద్దషాపూర్, మదనపల్లి, బస్టాపు మీదుగా శ్రీరామనగరం చేరుకోవచ్చు. ఎంజీబీఎస్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్లే బస్సు ఎక్కి మదనపల్లి దగ్గర దిగాల్సి ఉంటుంది. అక్కడ ఆటో ఎక్కి శ్రీరామనగరానికి చేరుకోవచ్చు.

Read More : Drug Tony Case : డ్రగ్స్ కేసులో కీలక విషయాలు, ఏడుగురు వ్యాపారవేత్తలకు బెయిల్

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైలులో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన అనంతరం 2 లేద 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి…అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు వెళ్లే బస్సుల్లో మదనపల్లికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ లో దిగితే…251 నెంబర్ బస్సు ఎక్కి శంషాబాద్ చేరుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో దిగితే…7, 8, 9 నెంబర్ బస్సులో అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. శ్రీరామానుజచార్య సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయి. ఈ రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడుపనుంది.