Samsung Galaxy F54 : శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!

Samsung Galaxy F54 : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ లాంచ్ ఈవెంట్‌కు ముందు, రాబోయే శాంసంగ్ 5G ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Samsung Galaxy F54 : శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!

Samsung Galaxy F54 India price and specs leaked ahead of June 6 Launch

Samsung Galaxy F54 India price specs leak : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) నుంచి లేటెస్ట్ Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 6న భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్‌కు ముందు.. రాబోయే శాంసంగ్ 5G ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ F సిరీస్ ఫోన్ గురించి కొన్ని వివరాలను కూడా ధృవీకరించింది. అవేంటో ఓసారి చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ F54 ధర లీక్ :
కొత్త శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్ భారత మార్కెట్లో రూ. 28,499 ప్రారంభ ధరతో వస్తుందని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరో టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ 5G ఫోన్ బాక్స్ ధర రూ. 35,999గా వెల్లడించారు. కానీ, సాధారణంగా డివైజ్ రిటైల్ బాక్స్‌లో కన్నా ధర తక్కువగా ఉంటుంది. అలాగే, ఈ ధర 256GB స్టోరేజీ మోడల్ కు వర్తిస్తుంది. శాంసంగ్ రెండు వేరియంట్‌లను ప్రకటించనుంది. అందులో గెలాక్సీ F54 ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 30వేల లోపు ఉంటుంది. జూన్ 6న శాంసంగ్ కొత్త 5G ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసిన తర్వాత ధరపై క్లారిటీ రానుంది.

Read Also : Airtel vs Jio Prepaid Plans : ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 5G డేటా, మరెన్నో బెనిఫిట్స్..!

శాంసంగ్ గెలాక్సీ F54 స్పెసిఫికేషన్స్ లీక్ :
శాంసంగ్ గెలాక్సీ F54 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ అయ్యాయి. 6.7-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పని చేస్తుంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. రాబోయే శాంసంగ్ ఫోన్ AMOLED ప్యానెల్‌ని ఉపయోగిస్తోంది. Galaxy F54 కంపెనీ Exynos 1380 చిప్‌సెట్‌ను హుడ్ కింద ఉపయోగించనుంది.

Samsung Galaxy F54 India price and specs leaked ahead of June 6 Launch

Samsung Galaxy F54 India price and specs leaked ahead of June 6 Launch

ఫోటోగ్రఫీ, వీడియోల కోసం వెనుకవైపు 108MP ప్రైమరీ కెమెరాను చూడవచ్చు. 8MP సెన్సార్, 2MP కెమెరాతో కూడి ఉంటుంది. ఈ డివైజ్ బాక్స్ వెలుపల సరికొత్త Android 13 OSతో రావొచ్చు.రాబోయే శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్ పేర్కొంది. ప్రస్తుతానికి, కంపెనీ బాక్స్‌లో ఛార్జర్‌ను బండిల్ చేస్తుందా లేదా అనే సమాచారం లేదు. శాంసంగ్ గెలాక్సీ F54 నాలుగు ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను అందుకోనుంది.

శాంసంగ్ గెలాక్సీ F54 అధికారికంగా ధృవీకరించిన ఫీచర్లు, డిజైన్ శాంసంగ్ గెలాక్సీ F54 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. OIS సపోర్టుతో 108MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ టీజర్ రిలీజ్ చేసింది. 5G ఫోన్‌లో ఎలాంటి మాడ్యూల్ లేకుండా వెనుక 3 సర్కిల్ కెమెరాలు ఉంటాయని వెల్లడించింది. మిగిలిన ఫీచర్లను శాంసంగ్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Read Also : New WhatsApp Update : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్.. ఒకేసారి 4 ఐఫోన్లలో వాట్సాప్ లాగిన్ కావొచ్చు తెలుసా?