Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!

Sarkaru Vaari Paata 8 Days Worldwide Collections

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!

సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి వారం రోజులు దాటినా కూడా ఈ సినిమాకు కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా 8 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకునే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.98 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి మహేష్ బాబు సత్తా మరోసారి చాటింది. ఇక ఈ సినిమా గ్రాస్ పరంగా రూ.155 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో రూ.100 కోట్ల షేర్ వసూళ్లు సాధించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..

ఈ సినిమాలో మహేష్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు అభిమానులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా 8 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 30.43 కోట్లు
సీడెడ్ – 10.21 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.02 కోట్లు
గుంటూరు – 8.10 కోట్లు
ఈస్ట్ – 7.61 కోట్లు
వెస్ట్ – 4.93 కోట్లు
కృష్ణా – 5.25 కోట్లు
నెల్లూరు – 3.14 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 80.69 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 5.79 కోట్లు
ఓవర్సీస్ – 11.52 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.98 కోట్లు (గ్రాస్ రూ.155.40 కోట్లు)