వకీల్ సాబ్ – ‘గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు’..

వకీల్ సాబ్ – ‘గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు’..

Sathyameva Jayathe: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా..శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌ బోని కపూర్‌తో కలిసి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో నటించారు. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘మగువా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. పవన్ పుట్టినరోజు నాడు వదలిన మోషన్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్ రికార్డ్ క్రియేట్ చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ‘‘సత్యమేవ జయతే’’ అనే పాటను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు..

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. సీనియర్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు.. ఆయనతో పాటు థమన్, పృథ్వీచంద్ర కూడా గొంతు కలిపారు.. ‘‘జన జన జన జనమనగణమున కలగలసిన జనం మనిషిరా.. మన మన మన మన తరపున నిలబడగల నిజం మనిషిరా.. నిషి ముసిరిన, కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా.. వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం. మన వెనుకనే దన్నై పోరాడితే.. సత్యమేవ జయతే’’.. అంటూ సాగే పాట అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది..

‘వకీల్ సాబ్’ థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూ. 50 కోట్లకు సేల్ అయ్యాయి.. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా కూడా ఇంత భారీ ధరకు అమ్ముడుకాలేదు.. ఏప్రిల్ 9న సినిమా భారీ లెవల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది..