Bela Trivedi: బిల్కిస్ బానో వేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది

ఈ పిటిషన్ విషయమై బిల్కిస్ తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు స్పందిస్తూ శీతాకాల సెలవుల కోసం సుప్రీంకోర్టుకు గడువు రావడమే తమ ఇబ్బంది అని పేర్కొన్నారు. కాగా, సుప్రీం స్పందిస్తూ ధర్మాసనం ఇప్పటికే ఈ కేసును విచారించిందని, కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని పేర్కొంది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లను ప్రస్తావించింది.

Bela Trivedi: బిల్కిస్ బానో వేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది

SC judge Bela Trivedi recuses from hearing Bilkis Bano’s plea

Updated On : December 13, 2022 / 6:35 PM IST

Bela Trivedi: తనపై సామూహిక అత్యాచారినికి పాల్పడటమే కాకుండా హత్యా నేరంలో దోషులుగా ఉన్న 11 మందిని ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మంగళవారం తప్పుకున్నారు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బెల్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు బిల్కిస్ బానో దాఖలు చేసిన రిట్ పిటిషన్ మొదటిసారిగా లిస్ట్ అయింది. అయితే తాజాగా ఈ పిటిషన్ జస్టిస్ త్రివేది లేని మరో బెంచ్ ముందుకు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది.

Tamil Nadu: బీజేపీలోకి అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‭సెల్వం..! గుజరాత్‭లో కమల పార్టీ నేతలతో సమావేశం

ఈ పిటిషన్ విషయమై బిల్కిస్ తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు స్పందిస్తూ శీతాకాల సెలవుల కోసం సుప్రీంకోర్టుకు గడువు రావడమే తమ ఇబ్బంది అని పేర్కొన్నారు. కాగా, సుప్రీం స్పందిస్తూ ధర్మాసనం ఇప్పటికే ఈ కేసును విచారించిందని, కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని పేర్కొంది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లను ప్రస్తావించింది. ఈ ఏడాది ఆగస్టు 25న మాజీ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించిన సందర్భంగా తొలి పిటిషన్‌పై కోర్టు నోటీసులు జారీ చేసింది.

India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

కింది బెంచ్‌లు ఇప్పటి ఈ వరకు కేసును విచారించాయి:
మాజీ సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం
జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బిసి నాగరత్నతో కూడిన ధర్మాసనం
జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం

ఈ పిటిషన్లలో గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది, ఈ 11 మంది దోషులు సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో విడుదల చేసినట్లు తెలిపింది. మే 2022 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ కేసును ఈరోజు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్ ఛాంబర్‌లో లిస్ట్ చేశారు.