Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ

డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై స్టే విధించాలని, అలాగే శాసన సభా పక్ష నేతగా అజయ్ చౌదరి నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ

Sena Rebels

Sena Rebels: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుగుబాటుకు పాల్పడ్డ 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే, ఎమ్మెల్యే భరత్ గోగావాలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య

డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై స్టే విధించాలని, అలాగే శాసన సభా పక్ష నేతగా అజయ్ చౌదరి నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది. ఏక్‌నాథ్ షిండేతోపాటు తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. శివసేన, ఆఫీస్ బేరర్ల తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనుండగా, డిప్యూటీ స్పీకర్ తరఫున జంధ్యాల రవి శంకర్ వాదనలు వినిపిస్తారు.

Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ

ఏక్‌నాథ్ షిండే, చిమన్‌రావ్ పాటిల్, బాలాజీ కళ్యాణ్‌కర్, సంజయ్ రాయ్‌ముల్కర్, రమేష్ బోర్నారే, మహేష్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీపన్‌ రావ్ బుమ్రే, భరత్‌ షేత్ గోగావాలే, సంజయ్ షిర్సత్, యామినీ జాదవ్, లతా సోనావానే, అనిల్ భబర్, తానాజీ సావంత్, బాలాజీ సావంత్‌లకు ఈనెల 25న డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలలోపు వీరంతా స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది.