Hema : ‘మా’ అధ్య‌క్ష బరిలో సీనియ‌ర్ న‌టి హేమ..

‘మా’ ఎన్నికల్లో నాలుగో పోటీదారుగా సీనియ‌ర్ స‌హాయ న‌టి హేమ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు..

Hema : ‘మా’ అధ్య‌క్ష బరిలో సీనియ‌ర్ న‌టి హేమ..

HEMA

Hema: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు రెండు ప్యానెల్‌ల మధ్య పోటీని చూశాం. కానీ ఈ సారి మూడు ప్యానెల్స్ రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఎన్నికలు మరింత ఉత్కంఠంగా మారాయి. ప్రెసిడెంట్ రేసులో వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, మంచు ఫ్యామిలీ నుంచి హీరో విష్ణు, మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ బరిలో దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పుడు నాలుగో పోటీదారుగా సీనియ‌ర్ స‌హాయ న‌టి హేమ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. గ‌త కొన్నేళ్లుగా ‘మా’ ఉపాధ్య‌క్షురాలిగా, సంయుక్త కార్య‌ద‌ర్శిగా, ఈసీ స‌భ్యురాలిగా ప‌ద‌వులు చేపట్టిన హేమ.. ఇప్పుడు త‌న వారికోసం పోటీకి దిగుతున్నాన‌ని అన్నారు.

MAA Elections : ‘మా’ లో తీన్మార్.. లోకల్ – నాన్ లోకల్ ఫీలింగ్.. జీవిత పరిస్థితి ఏంటి..?

వాస్తవానికి ఈ ఎలక్షన్స్‌లో హేమ, ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌నుకున్నారు. కానీ, ఉన్నట్టుండి అధ్యక్ష బరిలో నేను కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించి, ‘మా’ రాజకీయాల్లో వేడి పుట్టించడంతో పాటు అందర్నీ ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురి చేశారు.

తనకు కృష్ణంరాజు, కృష్ణ మద్దతు ఉందంటూ మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించగా.. మెగా బ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు.. మూడో పోటీదారీగా జీవిత రాజశేఖర్ రావడంతో పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది.

Manchu Vishnu : వారి మద్దతుతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం..!

వీళ్లు చాలరన్నట్లు హేమ కూడా ఎంట్రీ ఇవ్వడంతో.. అసలు అధ్యక్ష బరిలో పోటీ పడుతున్ను నలుగురిలో ఎవరు ఎవరకి మద్దతునిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘మా’ ఎన్నికల హంగామా ఇంకెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.