MAA Elections : ‘మా’ లో తీన్మార్.. లోకల్ – నాన్ లోకల్ ఫీలింగ్.. జీవిత పరిస్థితి ఏంటి..?

టాలీవుడ్‌లో మరో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికలు త్రిముఖ పోరుకు జరగనుంది..

MAA Elections : ‘మా’ లో తీన్మార్.. లోకల్ – నాన్ లోకల్ ఫీలింగ్.. జీవిత పరిస్థితి ఏంటి..?

Maa Elections

MAA Elections: టాలీవుడ్‌లో మరో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికలు త్రిముఖ పోరుకు జరగనుంది. ఇప్పటి వరకు రెండు ప్యానెల్‌ల మధ్య పోటీని చూశాం. కానీ ఈ సారి మూడు ప్యానెల్స్ రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఎన్నికలు మరింత ఉత్కంఠంగా మారాయి. ప్రెసిడెంట్ రేసులో వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, మంచు ఫ్యామిలీ నుంచి హీరో విష్ణు, మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ బరిలో దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తమ ప్యానెల్స్ ప్రకటించకముందే.. ఇండస్ట్రీలో హీట్ మొదలైంది.

మా అధ్యక్షపీఠం కోసం ఈసారి రసవత్తర పోరు తప్పేలా లేదు. ఈసారి ప్రెసిడెంట్ రేసులోకి దిగబోతున్న వాళ్ల లిస్ట్ చూస్తుంటే ఈ సారి ఎన్నికలు ఇండస్ట్రీలో ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది. మా అధ్యక్షుడి రేసులో.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. ఆయనకు పోటీగా.. మోహన్ బాబు కుమారుడు.. మంచు విష్ణు కూడా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక వీరిద్దరికీ పోటీగా జీవిత రాజశేఖర్‌ కూడా బరిలో నిలువనున్నట్టు చెబుతున్నారు. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్‌గా బరిలోకి దిగడంతో డిఫరెంట్‌గా ఉంటాయనుకున్నారు. అయితే జీవిత రాజశేఖర్ ఎంట్రీతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది సీన్. అయితే ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేసే వాళ్లెవరు? మంచు విష్ణుకి.. మద్దతిచ్చేదెవరు? జీవిత రాజశేఖర్‌ వెనక నిలిచేదెవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ప్రకాష్ రాజ్‌ వందలాది సినిమాల్లో నటించారు. కానీ, ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక కావడమే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ లోకల్ కావడంతో అసోసియేషన్ ఎన్నికల్లో.. కచ్చితంగా లోకల్-నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. దీనిని ప్రకాష్ రాజ్ ఎలా టాకిల్ చేస్తారన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్‌గా మారింది.

మా అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తెలుగు ఇండస్ట్రీ రెండు గ్రూపులుగా విడిపోతుంది. ప్రకాష్ రాజ్‌‌కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలిపారు. టాలీవుడ్‌లో దిల్ రాజు, సురేష్ ప్రొడక్షన్స్‌తో.. ఆయనకు మంచి రిలేషన్ ఉందని చెబుతుంటారు. దిల్ రాజు బ్యానర్‌లో వచ్చే ప్రతి మూవీలో.. ప్రకాష్ కచ్చితంగా ఉంటారనే టాక్ ఉంది. ఈ లెక్కన.. దిల్ రాజు, సురేష్ బాబు.. ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేసే అవకాశముందనే అంచనాలున్నాయి.

ఇక విష్ణు ఇండస్ట్రీ పెద్దల ఆశీస్సులతోనే బరిలోకి దిగునట్టు టాక్. తనకు కృష్ణ, కృష్ణం రాజు, మహేష్ బాబు మద్దతు ఉందంటున్నారు. మరి జీవిత రాజశేఖర్‌కు పరిస్థితి ఏంటి అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మరి ఈ ట్రయాంగిల్ పోరులో సినిమా ఇండస్ట్రీ ఎవరికి జై కొడుతుంది. ఎవరికి మద్దతు పలుకుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.