Mahesh Babu : మహేష్‌కి తల్లిగా సీనియర్ హీరోయిన్

ఇటీవల సీనియర్ హీరోయిన్స్ అంతా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ మళ్ళీ వెండితెరపై కనువిందు చేయనున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీ హీరోయిన్స్ రీఎంట్రీ ఇచ్చి..............

Mahesh Babu : మహేష్‌కి తల్లిగా సీనియర్ హీరోయిన్

Mahesh

 

SSMB 28 :  ఇటీవల సీనియర్ హీరోయిన్స్ అంతా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ మళ్ళీ వెండితెరపై కనువిందు చేయనున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీ హీరోయిన్స్ రీఎంట్రీ ఇచ్చి తల్లి, అత్త, అక్క పాత్రలు చేస్తున్నారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా రీఎంట్రీ ఇవ్వనుంది. 90వ దశకంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరితో కలిసి తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసారు హీరోయిన్ రాధ. చిరంజీవితో ఎన్నో ఆల్ టైం హిట్స్ ఇచ్చారు ఆమె. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైపోయింది.

ఇటీవల ఓ డ్యాన్స్ షోకి జడ్జిగా వచ్చింది. అప్పుడే తన రీఎంట్రీ ఫిక్స్ అయిపొయింది. ఆ షోలో పాల్గొన్న తర్వాత ఇలా మళ్ళీ చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ కూడా చేసింది. తాజాగా తెలుగు సినిమా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

DJ Tillu : సినిమా రిలీజ్ అవ్వకుండానే సీక్వెల్ ప్లానింగ్..

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ 28వ సినిమాలో మహేష్ బాబుకి రాధ తల్లిగా నటించనుందని సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సీనియర్ హీరోయిన్ రాధని కలిసి కథ చెప్పినట్టు, ఆమె ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహేష్ 28వ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.