Shaakuntalam: సెన్సార్ పూర్తి చేసుకున్న శాకుంతలం.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?

స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కు సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించికుంది.

Shaakuntalam: సెన్సార్ పూర్తి చేసుకున్న శాకుంతలం.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?

Shaakuntalam Completes Censor And Locks Runtime`

Shaakuntalam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ‘శాకుంతలం’ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తోంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని అత్యద్భుతంగా వెండితెరపై చూపెట్టనున్నాడు గుణశేఖర్.

Shaakuntalam : శాకుంతలంలో లాస్ట్ 15 నిమిషాలు అల్లు అర్హ యాక్టింగ్.. గుణశేఖర్!

ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని.. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 22 నిమిషాలుగా చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Shaakuntalam: శాకుంతలం 3D ట్రైలర్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఈ సినిమాతో సమంత మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా, గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న శాకుంతలం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.