Shaakuntalam : శ్రీవారి సేవలో శాకుంతలం టీం..

సమంత శాకుంతలం సినిమా రేపు విడుదలకు సిద్దమవుతుండడంతో చిత్ర యూనిట్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Shaakuntalam : శ్రీవారి సేవలో శాకుంతలం టీం..

Shaakuntalam movie team Gunasekhar and Dev Mohan visited Tirupathi

Shaakuntalam : సమంత (Samantha) నటించిన మైథ‌లాజిక‌ల్ డ్రామా మూవీ శాకుంతలం. హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంతో ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని అక్కటుకున్నాయి. ఈ శుక్రవారం (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా మంచి విజయం సాదించాలంటూ కొన్ని రోజులుగా పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారి సేవ కోసం తిరుపతి వెళ్లారు.

Samantha: అందుకే శాకుంతలం ప్రమోషన్స్ నుండి తప్పుకున్నా – సమంత

దర్శకుడు గుణశేఖర్, నీలిమ గుణశేఖర్, నటుడు దేవ్ మోహన్ తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సుల అందుకున్నారు. గుణశేఖర్ అండ్ దేవ్ మోహన్ మీడియా ముందు మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా ప్రేక్షక దేవుళ్ళ ముందుకు రేపు రాబోతుంది. తప్పకుండా థియేటర్ లో చూసి ఆదరిస్తారని భావిస్తున్నాము అంటూ వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Pushpa 2 : పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందా?? ఈ సారి సమంత ప్లేస్ లో ఎవరు?

ఈ సినిమాని గుణశేఖర్ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై గుణశేఖర్ మరియు దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా డెబ్యూట్ ఇవ్వబోతుంది. సినిమాలో ముఖ్య పాత్ర అయిన ప్రిన్స్ భారత పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా 3D వెర్షన్ లో ఆడియన్స్ ని అలరించనుంది.