Pathaan : బాహుబలి-2 వసూళ్లను దాటేసి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పఠాన్..

జనవరి 25న ఎంతో వ్యతిరేకత మధ్య రిలీజ్ అయిన పఠాన్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 చిత్రం..

Pathaan : బాహుబలి-2 వసూళ్లను దాటేసి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పఠాన్..

shah rukh khan pathaan movie crossed baahubali 2 collections

Pathaan : షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రెండు ఆశలను నెరవేర్చాడు. అందులో ఒకటి.. బాలీవుడ్ సినిమాల పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ అభిమానుల కోరిక అయితే, మరొకటి.. చెన్నై ఎక్స్‌ప్రెస్ తరువాత సరైన హిట్ లేని షారుఖ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న షారుఖ్ అభిమానుల కోరిక. ఈ రెండిటిని ఒక్క సినిమాతో తీర్చేసి మరోసారి బాలీవుడ్ బాద్‌షా అనిపించుకున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్. జనవరి 25న ఎంతో వ్యతిరేకత మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించింది.

Pathaan South Collections : పఠాన్ 1000 కోట్లు సరే.. తెలుగు, తమిళ్ లో ఎంత రాబట్టిందో తెలుసా?

మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. రోజుకో 100 కోట్ల చొప్పున 6 రోజుల్లో 600 కోట్లు సాధించింది. విడుదలయ్యి 5 వారలు అవుతున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఎన్నో వివాదాలు ఎదురుకున్న ఈ చిత్రం అసలు ఓపెనింగ్స్ అయినా సాధిస్తుందా? అని అనుకుంటే.. ఆ సందేహాలను తారుమారు చేస్తూ ఏకంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 28 రోజుల్లో 500 కోట్ల నెట్ షేర్ సాధించి.. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ హిందీ మూవీగా రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ చిత్రం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 చిత్రం లైఫ్ రన్ పూర్తీ అయ్యేసరికి రూ.510 కోట్ల నెట్ షేర్ సాధించింది. ఈ కలెక్షన్స్ పఠాన్ మూవీ 38 రోజుల్లోనే క్రాస్ చేసేసింది. ఆరో శుక్రవారం వచ్చే సరికి పఠాన్ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.510.65 నెట్ షేర్ సాధించింది. దీంతో ఇప్పటి వరకు హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న బాహుబలి స్థానాన్ని, ఇప్పుడు పఠాన్ సొంతం చేసుకుంది.

పఠాన్ తరువాత స్థానాల్లో బాహుబలి-2, కేజీఎఫ్-2, దంగల్ ఉన్నాయి. ఈ స్థానాలు కేవలం హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని ఆధారంగా చేసుకొని ఇస్తున్నవి మాత్రమే. ఇండియా వైడ్ అయితే బాహుబలి-2.. రూ.900 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక పఠాన్ చిత్రం ఇండియా వైడ్ ఇప్పటి వరకు రూ.528.29 షేర్ అందుకుంది. కాగా పఠాన్ సక్సెస్ తో బాలీవుడ్ కొంత ఊపిరి పీల్చుకుంటుంది.