Shah Rukh Khan: సొంత ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న షారుఖ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈమధ్య కాలంలో సరైన హిట్లు లేక సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అటు తన కొడుకు ఆర్యన్ ఖాన్.....

Shah Rukh Khan: సొంత ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న షారుఖ్

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈమధ్య కాలంలో సరైన హిట్లు లేక సినిమాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. అటు తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో షారుఖ్ చాలా ఆవేదనకు గురయ్యారు. అయితే వీటన్నింటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న షారుఖ్, ఇక వరుసగా ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు షారుఖ్ చాలా ఆసక్తిగా ఉన్నాడట.

Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

అయితే గతంలో సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలని షారుఖ్ అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగానే ఇప్పుడు సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. SRK+ అనే పేరుతో తన సొంత ఓటీటీతో బాలీవుడ్ కింగ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన షారుక్ ఒక్కసారిగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాలి. ఇక ఈ ఓటీటీ అనౌన్స్‌మెంట్‌లో ‘‘ఓటీటీ ప్రపంచంలో ఏదేదో జరగబోతుంది’’ అంటూ షారుఖ్ ఓ మెసేజ్ కూడా వదిలాడు.

షారుఖ్ తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫాంతో ఇప్పటికే ఉన్న దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యాడని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా తన నెక్ట్స్ మూవీ ‘పఠాన్’పై దృష్టి పెట్టిన కింగ్ ఖాన్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకుని బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.

Shahrukh Khan : లేట్ అయింది.. కానీ డేట్ గుర్తు పెట్టుకోండి.. ఎట్టకేలకు రాబోతున్న ‘పఠాన్’

కాగా పఠాన్ చిత్రాన్ని జనవరి 26, 2023లో రిలీజ్ చేయబోతున్నట్లు షారుఖ్ ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు అందాల భామ దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.