Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ మధ్య పూర్తిగా వెనకబడ్డాడు. ఒకవైపు వరస ప్లాపు సినిమాల నుండి బయటపడే ప్రయత్నాల్లో ఉన్న బాద్ షాకు కుమారుడు డ్రగ్స్ కేస్ వ్యవహారం ఇంకా వెనక్కి లాగింది.

Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ మధ్య పూర్తిగా వెనకబడ్డాడు. ఒకవైపు వరస ప్లాపు సినిమాల నుండి బయటపడే ప్రయత్నాల్లో ఉన్న బాద్ షాకు కుమారుడు డ్రగ్స్ కేస్ వ్యవహారం ఇంకా వెనక్కి లాగింది. మెంటల్ గా డిస్ట్రబ్ అయిన షారుఖ్ ఈ మధ్య అన్నిటికీ సెలవు ఇచ్చేసి డిప్రెషన్ మైంటైన్ చేస్తూ వచ్చాడు. దీంతో ఎక్కడికక్కడ సినిమాలు ఆగిపోయాయి. కొడుకు కేసు కొలిక్కి రావడంతో మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టిన కింగ్ ఇప్పుడు రెట్టించిన జోష్ తో మళ్ళీ వర్క్ మూడ్ లోకి వచ్చేశాడు.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకోన్ నటిస్తున్న తాజా సినిమా పఠాన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, తిరిగొచ్చిన షారూఖ్ ఖాన్ ఎయిర్ పోర్ట్ లో డ్రైవర్ ను హగ్ చేసుకున్నారు. అంతేకాదు నవ్వుతూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని పలకరించారు. దాంతో కింగ్ ఖాన్ ఫాన్స్ షారూఖ్ పై దిల్ వాలా అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Shah Rukh Khan: అందరినీ ఇబ్బందిపెట్టే షారుఖ్ బ్యాడ్ హ్యాబిట్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్.. చాలా కాలం తర్వాత వర్క్ మోడ్ లోకి వచ్చారు. దాదాపు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఖాన్.. కొడుకు డ్రగ్స్ కేసు కారణంగా కమిట్ మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని, కొంతకాలం పబ్లిక్ కు దూరంగా ఉన్నారు. ముంబై కోర్టు ఇచ్చిన తీర్పుతో రిలీఫ్ అయిన కింగ్ ఖాన్ ప్రస్తుతం వర్క్ మోడ్ లోకి వచ్చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన షారూఖ్ పఠాన్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక షారూఖ్ ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తాడంటున్నారు ఫాన్స్.